Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం అరగంటకు తక్కువ కాకుండా నడవటం లేదా వ్యాయామం తప్పనిసరి. ఇది రక్తప్రసరణ సాఫీగా ఉండేలా చేస్తుంది. శరీరాన్ని దఢంగా ఉంచుతుంది.
- బ్రేక్ఫాస్ట్ ఆకలి తీరిస్తే సరిపోదు. శక్తినిచ్చే పోషకాహారం అయ్యుండాలి. అప్పుడే జీవకణాల్లో రసాయనిక చర్య (మెటబాలిజం) సవ్యంగా ఉంటుంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు ఎక్కువ తాగాలి. రోజుకు రెండు లీటర్ల నీరు తాగగలిగితే సగం సమస్యలను నివారించినట్లే. శరీరంలో కాల్షియం, మెగ్నీషియం, జింక్- ఈ మూడూ తక్కువ కాకుండా చూసుకోవాలి. అందుగ్గానూ పాలు, యోగర్ట్, బాదం, నువ్వులు, జీడిపప్పు, అరటి మొదలైన పండ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, క్యారట్, సోయా, బఠాణీలు తింటుండాలి.
- అధిక బరువు అనారోగ్యానికి దారితీస్తుంది. కనుక ఎప్పటికప్పుడు బరువు చూసుకుంటూ పెరిగినట్టనిపిస్తే అప్రమత్తం కావాలి. థైరాయిడ్ సమస్య వుందేమో చెక్ చేయించుకుని అవసరమైన మందులు వాడాలి.
- నిరంతరం పనులు చేస్తూ అందరికీ ఆసరాగా ఉండటమే కాదు, మన గురించి మనం పట్టించుకోవాలని మర్చిపోవద్దు. రోజులో కాసేపు ఒంటరిగా, గడిపితే ప్రశాంతత చేకూరుతుంది. ఇది అలసటను పోగొడుతుంది.
- శరీరానికి ఏడు గంటల నిద్ర అవసరం. నిద్ర పట్టకుంటే కాసేపు ధ్యానం చేస్తే సరి. క