Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణం చిరు జల్లులతో చల్లబడింది. మరి ఈ కాలానికి తగ్గట్టు కుటుంబ సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా ఉంటారు.
గోరువెచ్చని నీళ్లు: వర్షాకాలంలో ఎక్కువ వ్యాధులు నీటి కారణంగానే సంక్రమిస్తాయి. అందుకే ఆ పరిస్థితి ఎదురుకాకుండా... నీళ్లను కాచి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి తక్కువ తాగుతుంటారు. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తొచ్చు. ఎప్పటికప్పుడు వారు నీళ్లు సరిగా తాగుతున్నారో లేదో చూసుకోండి.
శుభ్రంగా: ఈ కాలంలో చిన్నారులు తరచూ తడవకుండా చూసుకోండి. చేతులూ, కాళ్లు పరిశుభ్రంగా ఉండాలి. రాత్రి పడుకునే ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీ రాస్తే ఒరుపులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్నా సాక్సులు వేయడం మంచిది.
సమతులాహారం: చిన్నారులకు తేలిగ్గా అరిగే ఆహారాన్ని పెట్టండి. మసాలా వంటకాలు, జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉంచండి. కూరగాయలు, పళ్లకు ప్రాధాన్యం ఇవ్వండి. వీలైనంత వరకూ ఆవిరి మీద ఉడికించిన రకాల్ని తీసుకుంటే మేలు.