Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం చేసే మహిళలపై గహిణిగా కూడా ఎన్నో బరువు బాధ్యతలుంటాయి. అటు వాటన్నింటినీ నిర్వర్తిస్తూ, ఇటు కెరీర్లోనూ కొనసాగాలంటే కత్తి మీద సామే! అయితే ఈ క్రమంలో కొంతమంది మహిళలు తమ వత్తిగత జీవితానికి కాస్త గ్యాప్ ఇచ్చి ఇంటికే పరిమితమవుతుంటారు. ముఖ్యంగా కొత్తగా తల్లైన మహిళలు తమ చిన్నారుల ఆలనా పాలన కోసం తమ కెరీర్ నుంచి కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకుంటుంటారు. ఆ తర్వాత మళ్లీ ఉద్యోగ వేట ప్రారంభిస్తుంటారు. అయితే ఇలా కెరీర్ పరంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు మహిళలు కొన్ని విషయాలు దష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు కార్పొరేట్ నిపుణులు. అప్పుడే ఉద్యోగం సంపాదించడం, అందులో నిలదొక్కుకొని తమను తాము నిరూపించుకోవడం సులభమవు తుందంటున్నారు.
పిల్లలు పుట్టిన తర్వాత మహిళల జీవితం ఇంటికే పరిమితమవుతుందనుకుంటారు చాలామంది. కానీ ఈ తరానికి చెందిన మహిళలు మాత్రం ఇది ఎంతమాత్రం కరక్ట్ కాదని నిరూపిస్తున్నారు. పిల్లలు పుట్టిన కొన్ని నెలలకే తిరిగి పనిలోకి అడుగుపెడుతున్నారు. ఒకవేళ పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి ఇంటి దగ్గర కుటుంబ సభ్యులెవరూ లేకపోతే.. కొన్నేండ్ల పాటు కెరీర్‌కి గ్యాప్ ఇచ్చి.. వాళ్లు పెద్దై స్కూలుకెళ్లే సమయంలో తల్లులు తిరిగి ఉద్యోగ వేట ప్రారంభిస్తున్నారు. అయితే అంతకంటే ముందు ఈ విషయాలు దష్టిలో ఉంచుకోమని చెబుతున్నారు నిపుణులు.
ఆసక్తిని తెలుసుకోండి!
ఫలానా రంగంలో ఉద్యోగం తెచ్చుకోవాలి.. ఉన్నత స్థాయికి ఎదగాలి.. ఇలా కెరీర్ పరంగా ఒక్కొక్కరిదీ ఒక్కో దారి! అలాగని అందరూ ఇలా తమ ఆసక్తికి తగిన ఉద్యోగమే చేస్తారని చెప్పలేం. ముందు ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు తలెత్తచ్చు.. కొంత ఉద్యోగ అనుభవం సంపాదించాక ఆ దిశగా ప్రయత్నాలు చేయచ్చు కదా అనుకోవచ్చు. ఇలా పలు కారణాల వల్ల తమ అంతిమ లక్ష్యాన్ని వాయిదా వేస్తూ వచ్చిన వారికి రెండో ఇన్నింగ్స్ సరైన సమయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ క్రమంలో ఇంట్లో ఉంటూ పిల్లల బాధ్యతలు చూసుకున్నప్పటికీ.. రోజులో అప్పుడప్పుడూ ఎంతో కొంత సమయం దొరుకుతుంది. మీ తపనను నెరవేర్చుకోవడానికి ఆ సమయాన్ని కేటాయించచ్చు. కాబట్టి ముందు ఏదో ఒక ఉద్యోగంతో సరిపెట్టుకున్నా.. ఇప్పుడు మీ తపనేంటో తెలుసుకోండి.. అంతిమ లక్ష్యం దిశగా అడుగులేయండి.. ఈ క్రమంలో కొత్త విషయాలపై అవగాహన పెంచుకుంటూ, నైపుణ్యాల్ని మెరుగుపరచుకుంటూ, టెక్నాలజీ విషయంలో అప్డేటెడ్గా ఉంటూ రెజ్యూమెను అప్డేట్ చేసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు.
మీవంతు ప్రయత్నం
రోజులు గడుస్తున్న కొద్దీ సమయం వథా తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ఒక రకమైన అలసత్వం ఆవహించే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో కెరీర్‌పై దష్టి పెట్టే వారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యోగ వేట ప్రారంభించాలంటున్నారు నిపుణులు. లేదంటే గ్యాప్ పెరిగిన కొద్దీ దాన్ని పూడ్చుకోవడం కష్టమవుతుందంటున్నారు. అవకాశాలూ సన్నగిల్లుతాయంటున్నారు. ఈ క్రమంలో మీరు గతంలో పనిచేసిన మీ సహౌద్యోగులతో నిరంతరం టచ్‌లో ఉండడం మాత్రం మర్చిపోవద్దు. తద్వారా ఆయా కంపెనీల్లో ఉండే ఖాళీల వివరాలు వారు మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది. దాంతో ఉద్యోగ ప్రయత్నాలు మరింత సులభమవుతాయి. అంతటితో ఆగకుండా మీ వంతుగా మీరు ఆయా జాబ్ పోర్టల్స్‌లో మీ ప్రొఫైల్‌ను అప్డేట్ చేసుకుంటే వీలైనంత త్వరగా తిరిగి ఉద్యోగంలో చేరచ్చు.
ప్రారంభించే ముందే
కెరీర్లో గ్యాప్ తీసుకోవడం వరకు బాగానే ఉంటుంది.. కానీ ఒక్కోసారి ఆ గ్యాప్‌ను పూడ్చడం అంత తేలిక కాకపోవచ్చు. అయితే అందుకు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించే ముందు నుంచే సన్నద్ధం కావాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు కెరీర్ నుంచి ఎందుకు విరామం తీసుకోవాల్సి వచ్చింది? ఇన్ని రోజులు సమయం వథా చేశారా? ఏవైనా నైపుణ్యాలు నేర్చుకున్నారా? లేదంటే ఏదైనా బిజినెస్ చేశారా? వంటి వివరాలన్నీ ఇంటర్వ్యూ చేసే బందానికి ఓర్పుగా నేర్పుగా వివరించాల్సి ఉంటుంది. ఇలా చెప్పే క్రమంలో ఏమాత్రం తడబడినా ఎదుటివారికి సందేహం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ తల్లిగా పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికే కెరీర్ నుంచి విరామం తీసుకోవాల్సి వస్తే.. నిస్సందేహంగా అదే విషయం చెప్పచ్చు. ఇక ఇప్పుడు ఉద్యోగానికి పూర్తి సన్నద్ధమయ్యానంటూ వారికి వివరిస్తే సరిపోతుంది. తద్వారా మీ పరిస్థితిని వారు అర్థం చేసుకొని మీ అర్హతలు, మీ నైపుణ్యాల్ని బట్టి మీకు ఉద్యోగం కల్పించే ఆస్కారం కచ్చితంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
ఖాళీగా కూర్చోవద్దు
రెండో ఇన్నింగ్స్‌లో ఉద్యోగ బాట పట్టేవారికి అనుకున్నంత త్వరగా ఉద్యోగం దొరకచ్చు.. దొరక్కపోవచ్చు..! ఈ క్రమంలో ఒకవేళ ఫుల్‌టైమ్ జాబ్ దొరక్కపోతే పార్ట్‌టైమ్ అయినా ప్రయత్నించమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఖాళీగా కూర్చుంటే బద్ధకం పెరిగిపోతుంది.. ఒక రకమైన అలసత్వం దరిచేరుతుంది.. ఇవి ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకం కలిగించచ్చు. కాబట్టి అమ్మగా మీరెంత బిజీగా ఉన్నా.. మళ్లీ ఉద్యోగం చేయాలనుకుంటే మాత్రం పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయడం మంచిది. ఏదో ఒక ఖాళీ సమయం చూసుకొని పనిచేయచ్చు. దాంతో మీలో నైపుణ్యాలు మెరుగుపడతాయి.. ఇవి మీ కలల ఉద్యోగాన్వేషణను మీకు మరింత దగ్గర చేస్తాయి.
కోర్సులు నేర్చుకోవచ్చు
అమ్మయ్యాక తిరిగి ఉద్యోగ వేట ప్రారంభించే తల్లులు కొత్త కోర్సులు నేర్చుకోవడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. కొత్తగా తల్లైన వారికి అంత సమయం ఉండచ్చు.. ఉండకపోవచ్చు.. కానీ పిల్లలు పెరిగి పెద్దయ్యే కొద్దీ, స్కూలుకెళ్లే క్రమంలో రోజులో గంటో, రెండు గంటలో సమయం దొరక్కపోదు. ఆ సమయాన్ని కెరీర్ పరంగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇందులో భాగంగా మీరు నేర్చుకోవాలనుకున్న కోర్సులు, పెంచుకోవాలనుకున్న నైపుణ్యాలకు సంబంధించిన తరగతులు ఆన్లైన్లోనే బోలెడున్నాయి. వాటిలో కొన్ని ఉచితంగానైనా చేరచ్చు.. లేదంటే కొంత ఫీజు చెల్లించి చేరచ్చు.. ఇలా మొత్తానికి ఖాళీగా సమయం వథా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటే మీ ఉద్యోగ వేట మరింత సులభమవుతుందంటున్నారు నిపుణులు. తల్లైనా చక్కటి కెరీర్‌ను ఎంచుకొని.. అందులో రాణించాలంటే ఎన్ని మార్గాలున్నాయో తెలుసుకున్నారు కదా! ఇవన్నీ గుర్తు పెట్టుకొని ముందుకెళ్తే కచ్చితంగా కలల ఉద్యోగం సొంతం చేసుకొని కెరీర్లో అభివద్ధి సాధించచ్చు. క