Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆఫీసు పని, పెరిగిన బాధ్యతలు, ఇంటికే పరిమితమవడం, ఒత్తిడి... వెరసి దీనికి దారి తీస్తున్నాయంటున్నారు నిపుణులు. నివారణకు కొన్ని చిట్కాలూ సూచిస్తున్నారు. మైగ్రేన్ ఉన్నవారూ వీటిని పాటించొచ్చు.
ఒత్తిడి, ఆందోళన శ్వాసపైనా తద్వారా మానసిక స్థితిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి శరీరానికి తగిన ఆక్సిజన్ అందేలా చూసుకోవాలి. ఇది కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్ స్థాయులను తగ్గేలా చేయడంతో పాటు శరీరాన్ని రిలాక్సేషన్ మోడ్‌లోకి తీసుకెళ్తుంది. అందుకే అప్పుడప్పుడూ దీర్ఘశ్వాసను తీసుకుని వదులుతుండాలి.
ఒత్తిడి పెరిగే కొద్దీ దీర్ఘనిద్ర శాతం తగ్గుతుంటుంది. ఇది మెదడు, శరీరం రెండింటిపైనా ప్రభావం చూపుతుంది. అరకొర, అసంపూర్తి నిద్ర తలనొప్పికి కారణమవుతాయి. ఒకే సమయంలో పడుకోవాలి. నిద్రకు గంట ముందు గ్యాడ్జెట్లను పక్కన పెట్టాలి.
రోజులో కొద్దిసేపైనా వ్యాయామం చేయాలి. ఇది శరీరానికంతటికి రక్తప్రసరణ జరిగేలా చూస్తుంది. సహజ నొప్పి నివారిణిగా తోడ్పడే ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. బ్రిస్క్ వాక్, యోగా... వీటిలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.
తగినన్ని నీటిని తీసుకోకపోతే డీహైడ్రేషన్‌తోపాటు టాక్సిన్లు శరీరంలోనే ఉండిపోయి మైగ్రేన్‌కు కారణమవుతాయి. రక్తప్రసరణా నెమ్మదిస్తుంది. మెదడుకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ చేరవు. కాబట్టి రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి.
ఎసెన్షియల్ ఆయిల్: తులసి, పెప్పర్మింట్, యూకలిప్టస్ నూనెలను నుదురు, కణతులకు పట్టించి, నెమ్మదిగా మర్దనా చేయాలి. వీటి సువాసనలు శరీరం రిలాక్స్ అయ్యేలా చేసి ఉద్వేగాలనూ అదుపు చేస్తాయి.