Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒత్తిడి కారణంగా సహజసిద్ధమైన సౌందర్యంపై ఇంతలా ప్రభావం పడుతుంది కాబట్టే ఇలాంటి మానసిక సమస్యలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని చిన్న చిన్న చిట్కాల్ని పాటించాల్సి ఉంటుంది.
బిజీగా ఉంటే పని ఒత్తిడి, ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలతో మనసంతా అయోమయంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మీకు ఏ పనైతే ఇష్టంగా చేయాలనిపిస్తుందో ఆ పనిలో బిజీగా మారిపోమంటున్నారు నిపుణులు. తద్వారా మనసుకు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఏదో తెలియని సంతృప్తి మన మనసులో నిండిపోతుంది.
మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా కూడా ఒత్తిడిని అదుపు చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. డార్క్ చాక్లెట్, గుడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు వంటివి చక్కగా పనిచేస్తాయట. వీటిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లే అందుకు ప్రధాన కారణమట!
రోజూ ఉదయం లేదా సాయంత్రం ఓ అరగంట పాటు మీకు నచ్చిన వ్యాయామాలు చేస్తే అసలు ఒత్తిడి దరిచేరదని చెబుతున్నారు.
ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, మీ మనసుకు నచ్చిన వారితో చూడండి. మంచి ఉపశమనం లభిస్తుంది.