Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం మారింది... లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు అడ్డంకులు కాస్త ఎక్కువ. ఈ సవాళ్లని ఎలా అధిగమించాలి? విజయానికి ఎలా చేరువ కావాలి?
ఆలోచనల్లో స్పష్టత ఉంటే సగం సమస్యలు తీరినట్టే. కానీ అమ్మాయిలకు ఇల్లు, కుటుంబం, సమాజం ఇలా ఎన్నో విషయాలు ముందర కాళ్లకు బంధం వేస్తాయి. ఇలాంటప్పుడు మీ మనసులోని ప్రశ్నల్ని, వాటికి సానుకూల సమాధానాల్ని మాత్రమే ఓ పుస్తకంలో రాయండి. అవి మీకు దారిని చూపిస్తాయి.
మీ లక్ష్యం వాస్తవికమైనదో కాదో ముందు గమనించుకోవాలి. మీ బలాలు, బలహీనతలపై పట్టు ఉండాలి. అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోగలిగే చొరవ కావాలి. ఇవే మిమ్మల్ని గెలుపు బాటలో నడిపిస్తాయి.
ఆత్మస్థైర్యం, చొరవ, పోరాటపటిమ, కష్టపడే తత్వం ఉన్న వారికి గుర్తింపునీ, పదోన్నతులనూ తెచ్చిపెడతాయని చెబుతారు కెరీర్ నిపుణులు. మీరూ ఆ వైపు ఆలోచించండి.
కాలంతో పాటు మన చుట్టూ ఎన్నో మార్పులు జరిగిపోతూ ఉంటాయి. వాటిని గమనించుకోవాలి. మార్పులను అంగీకరించగలగాలి.