Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచి బాస్ అంటే ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. అంతే కాదు ఉద్యోగులతో బాస్‌లు ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు చెప్పకూడదు? వీటికి సంబంధించి పెద్దలు కొన్ని విషయాలు చెబుతారు. వాటిని పాటిస్తే ఆ బాస్‌ను మంచి బాస్ అనొచ్చట. మరి అవేంటో చూసేయండి. ఒకవేళ మీరు బాస్ అయితే మంచి బాస్ అనిపించుకోండి.
కష్టాన్ని గుర్తించాలి: ఒకరి కష్టాన్ని మనం లాక్కోవడం అంటే... ఆ కష్టానికి వచ్చిన పేరును లాక్కోవడమే. బాస్ ఎప్పుడూ ఉద్యోగుల కష్టాన్ని తన గొప్పతనంగా తీసుకోకూడదు. వారి కష్టానికి ఎప్పటికప్పుడు గుర్తింపునివ్వాలి.
అభిప్రాయాలకు విలువ: ఉద్యోగి పని చేయడంలో మానసిక ప్రశాంత కూడా కీలక పాత్ర వహిస్తుంది. అందుకే వాళ్లు ఎక్కడికైనా దూరంగా వెళ్లి కాస్త ప్రశాంతంగా నాలుగు రోజులు గడిపి వస్తాం అంటే నో చెప్పకూడదు. అప్పుడు వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ కుదురుతుంది.
అధికార ధోరణి ప్రమాదం: నేను బాస్‌ను కాబట్టి నేను చెప్పిందే ఉద్యోగులు వినాలిః... ఈ మాట నేటి ఉద్యోగుల దగ్గర చెల్లుబాటు కాదు. తమ మాటలు, అభిప్రాయాలకు విలువ ఇచ్చే కంపెనీల్లోనే పని చేయాలని నేటి తరం అనుకుంటున్నారు. అందుకే సూచనలు ఇచ్చే ఉద్యోగిని మెచ్చుకుంటూ అవసరమైతే వాటిని తీసుకోవడం ఉత్తమం.
అనవసర స్టేట్మెంట్లు వద్దు: ఎవరైనా ఉద్యోగి వచ్చి ఈ పని నేను చేయను అని చెప్తే... వెంటనే ఆ వ్యక్తి గురించి స్టేట్మెంట్లు ఇవ్వడం లాంటివి చేయకూడదు. దానికి బదులు అసలు ఆ పని చేయడానికి వారు ఎందుకు నో అంటున్నారో కనుక్కోవాలి. అంతేకానీ ఓ మాట అనేయడం వల్ల మనస్పర్థలు వస్తాయి తప్ప.. పని జరగదు.
మాటలు జాగ్రత్త: బాస్ కదా అని ఉద్యోగులతో ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అనుకోకూడదు. తమకు గౌరవం దక్కాలని ఎలా అనుకుంటున్నామో, ఉద్యోగులు కూడా అలానే అనుకోవాలి. వారిని అగౌరవపరిచే మాటలు అంటే.. ఆ పని చేసే సంస్థకు తద్వారా ఉద్యోగులకు కలిగే లాభం గురించి చెప్పి ఒప్పించాలి.
ప్రశంస ముఖ్యం: ఈ రోజు బాగా పని చేశావ్ చాలామంది బాస్‌లు ఈ మాటను ఉద్యోగులతో చెబుతుంటారు. అయితే ఇలా సాధారణంగా చెప్పే బదులు చేసిన పని గురించి మీకు తెలిసింది అనేలా ఫలానా పని చేశావ్.. గుడ్ః అంటే వారి పనిని మీరు బాగా పరిశీలిస్తున్నట్టు ఉద్యోగులు భావిస్తారు. అది బాస్‌కు చాలామంచింది.
ఫీడ్ బ్యాక్ ఎలా?: నీ వర్క్‌తో నన్ను నిరాశపరిచావ్... ఈ మాట అంటే మీ ఫీలింగ్‌ను ఉద్యోగితో చెబుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఆ మాట ఉద్యోగి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. దానికి బదులు ఉద్యోగికి మీరు చెప్పాలనుకున్న ఫీడ్ బ్యాక్‌ను పక్కాగా చెప్పాలి.