Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ గిన్నెలో యాపిల్ పండు గుజ్జు, నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ పూత వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి. అలాగే దీన్ని తరచూ వేస్తూ ఉంటే మోముపై ఉండే ముడతలు, నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. దాంతో ముఖం శుభ్రంగా, కాంతిమంతంగా మారుతుంది.
రెండు చెంచాల యాపిల్ గుజ్జు, చెంచా చొప్పున పెరుగు, దానిమ్మ రసం... ఈ మూడింటిని కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగితే సరి. సహజ సిద్ధపదార్థాలతో వేసిన ఈ పూత వల్ల చర్మం లోపలి నుంచి శుభ్రపడుతుంది. ఫలితంగా నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు చిటికెలో మోము కాంతిమంతంగా మారుతుంది.