Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లాన్ని రోజూ కొద్దిగా వాడుతూ ఉంటే... మీకు కడుపులో గడబిడ సమస్యలు దాదాపు ఉండవు. ఎలా వాడాలో, ఎంత వాడాలో తెలుసుకుందాం.
బాడీ ఫిట్‌గా ఉండాలంటే... అల్లం తినాలని నిపుణలు అంటున్నారు. ఫిట్నెస్కీ, అల్లానికీ సంబంధం ఉందంటున్నారు. పండ్లు అయితే సీజన్లో మాత్రమే లభిస్తాయి... అదే అల్లం ఏడాదిలో ఎప్పుడైనా సరే రెడీగా లభిస్తుంది. మన ఇళ్లలోని వంటల్లో అల్లాన్ని రుచి కోసం వాడుతారు. అల్లం కేవలం రుచి కోసం మాత్రమే కాదు. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
నిమ్మరసంలో ఉప్పు కలుపుకొని తాగుతాం కదా... అల్లానికి పైన తొక్క తీసేసి సన్నగా తరిగిన ఓ రెండు అల్లం స్లైసెస్ ఆ మిశ్రమంలో వేసి తాగి చూడండి... రుచి అదిరిపోతుంది.
మనలో కొందరు సైనస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆ సైనస్ ఎంతలా ఇబ్బంది పెడుతుంటే... ముక్కులో ఏదో ఇరుక్కుపోయినట్టు, దాన్ని లాగి బయటకు విసిరేయాలన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ అది ఎక్కువై... భరించలేని ఇబ్బంది వస్తుంది. సైనస్‌కి అల్లం బాగా పనిచేస్తుంది. మార్కెట్లో అల్లం పొడి లభిస్తుంది. దాన్ని తెచ్చుకొని రోజూ గ్లాస్ నీటిలో కలుపుకొని తాగేస్తే క్రమంగా సైనస్ సమస్యలు తగ్గిపోతాయి.
శరీరానికి గాయాలై మండుతున్నాయా? వాటిపై ఏ మందైనా రాస్తున్నప్పుడు సుర్రు మంటోందా? ఆ మంటను భరించలేకపోతున్నారా? అయితే ఈ సమస్యకు అల్లం బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో అల్లాన్ని ఉడకబెట్టండి. అప్పుడు అల్లంలో సారం... కొబ్బరి నూనెలో కలుస్తుంది. ఆ మిశ్రమాన్ని గాయాలపై రాసుకోండి. ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది. గాయాలవల్ల అయ్యే నొప్పులను అల్లం వెంటనే పోగొడుతుంది. ఎందుకంటే... అల్లంలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు బోలెడన్ని ఉన్నాయి.
వికారంగా ఉంటే... వాంతులు అవుతాయేమో అనే టెన్షన్ ఉంటే... సింపుల్‌గా ఓ అల్లం స్లైస్ తీసుకొని దానిపై కొద్దిగా ఉప్పు చల్లి తినండి... అంతే... వాంతులు అయ్యే ఫీలింగ్ పోతుంది.
కడుపు నొప్పి వస్తున్నా, గ్యాస్ ఉన్నట్టు అనిపిస్తున్నా, పొట్ట ఉబ్బినా, ఉబ్బరంగా అనిపిస్తున్నా... ఇలా కడుపులో గడబిడ ఉన్నప్పుడు వెంటనే ఓ గ్లాసులో కొద్దిగా అల్లం పొడి వేసి కలిపి గటగటా తాగేయండి. ఆ తర్వాత గమనించండి గ్యాస్ మొత్తం... బయటకు పోతుంది. ఉబ్బిన పొట్ట కాస్తా... మళ్లీ యధాస్థితికి వచ్చేస్తుంది. అసలీ ఉబ్బరాలూ అవీ రాకుండా ఉండాలంటే మీరు చేసుకునే వంటల్లో తప్పనిసరిగా అల్లం వేసుకోండి... ఎంతో ఆరోగ్యం.
దగ్గు, జలుబు ఉంటే అల్లం తినడం, అల్లం రసం తాగడం మానొద్దు. ఈ సమస్యలకు అల్లం అత్యంత అమూల్యమైనది. అల్లం ఉడికించి ఆ నీరు తాగారంటే... కరోనాను ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా మీ బాడీ ఫిట్‌గా, ఇమ్యూనిటీతో తయారవుతుంది. అదీ మరి అల్లమంటే.