Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిథాలీ రాజ్... భారత మహిళా క్రికెట్ జట్టుకు నాయకురాలిగా అందరికి తెలిసిన వ్యక్తి. 'లేడీ టెండూల్కర్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్' గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఆమె గురించి ప్రపంచానికి తెలియని కొన్ని స్ఫూర్తిదాయక విషయాలు ఉన్నాయి.. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం...
మిథాలీ రాజ్‌కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. బ్యాటింగ్‌కి వెళ్ళే ముందు ఆమె తరచూ స్ఫూÛర్తిదాయకమైన జీవితాలను చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంది. ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం బయలుదేరే ముందు 13 వ శతాబ్దపు పెర్షియన్ కవి అయినటువంటి జలాలుద్దీన్ రూమిని చదివినట్టు ఆమె తరచూ చెబుతుంటారు. అంతేకాదు 71 పరుగులు చేసి వన్డే అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు సాధించిన మొదటి మహిళ కూడా ఈమెనే.
లింగ వివక్షను భరించలేదు
క్రికెట్ ప్రపంచంలో లింగ వివక్షను ఆమె ధైర్యంగా ప్రశ్నిస్తోంది. 2017 ప్రపంచ కప్ సందర్భంగా ఓ ప్రెస్ మీట్లో మీ అభిమాన పురుష క్రికెటర్ పేరు చెప్పమని అడిగినప్పుడు ఆమె వెంటనే దాన్ని ఖండించింది. అంతేకాదు ''మీరు మమ్మల్ని మగ క్రికెటర్ గురించి అడుగుతున్నారు... వారి అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు అని మీరు మగ క్రికెటర్‌ను అడుగుతున్నారా?'' అంటూ ప్రశ్నించి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
ట్విట్టర్లో కీలకపాత్ర
మిథాలీ రాజ్ ఒకప్పుడు ట్విట్టర్ ఎమోజి లీడర్‌బోర్డ్‌లో కీలకపాత్ర పోషించింది. 2017 ప్రపంచ కప్ సందర్భంగా ట్విట్టర్ కస్టమ్ ఎమోజిస్ టీం కెప్టెన్లను పరిచయం చేసింది. వీటిని వినియోగదారులు అన్‌లాక్ చేయవలసి ఉంది. అలాగే భారత కెప్టెన్ మిథాలీ చార్టులో అగ్రస్థానంలో ఉంది.
16 ఏండ్ల వయసులో...
26 జూన్, 1999న వన్డేలో అడుగుపెట్టినప్పుడు మిథాలీ రాజ్ వయసు 16 సంవత్సరాలు. 250 రోజులు. అప్పుడే వంద పరుగులు చేసిన అతి పిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకుంది. మార్చి 2021లో 10,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
డ్యాన్స్ అంటే ప్రేమ
భారత వైమానిక దళంలో వారెంట్ అధికారి అయిన డోరై రాజ్ కుమార్తె అయిన మిథాలీ రాజ్ ఆమెకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఈ రోజు క్రికెట్ ప్రపంచంలో ఎందరి హృదయాలనో గెలుచుకుంది. ఆయితే ఆమె మొదటి ప్రేమ భరతనాట్యం. నేటికీ డ్యాన్స్ అంటే ఆమెకు ఎంతో ప్రేమ. పాఠశాలలో చదివే సమయంలో నృత్యం నేర్చుకున్న రోజులను ఆమె తరచూ గుర్తు చేసుకుంటుంది. మైదానంలో ఆటపై మనసు లగం చేయడం ఆమె డ్యాన్స్ ద్వారానే నేర్చుకున్నానని చెబుతున్నారు.