Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నానికి ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్‌ను ఎంచుకుంటున్న వారెందరో. కాస్త దాని రుచికి దగ్గరగా ఉండాలనుకునేవారు ఊదలను తీసుకోవచ్చు. వీటితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
కెలొరీలు తక్కువ, ఫైబర్, ప్రొటీన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి తీసుకుంటే రోజులో శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది. ఎనీమియాతో బాధపడేవారు, హిమోగ్లోబిన్ శాతాన్ని త్వరగా పెంచుకోవాలనుకునేవారు దీన్ని తరచూ తీసుకోవొచ్చు.
ఫైబర్ ఎక్కువ. కొన్ని రకాల క్యాన్సర్లను దూరంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమ ఎంపిక. దీనిలోని అమైలేజ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలోని లినోలిక్, పల్మిటిక్, ఒలియాక్ ఆసిడ్లు గుండె సంబంధ వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. గ్లూకోజ్ స్థాయులూ తక్కువే. కాబట్టి మధుమేహం ఉన్నవారూ తీసుకోవచ్చు.