Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పైపెదవి పైన ఉండే చర్మంలోని కణాలు డ్యామేజ్ కావడం వల్ల ఆ ప్రదేశం నలుపుగా మారడం, పిగ్మెంటేషన్.. వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మరి వీటిని తగ్గించడానికి క్యారట్, పెరుగు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా క్యారట్‌లోని బీటాకెరోటిన్, పెరుగులోని ల్యాక్టికామ్లం వంటివి ఈ సమస్యని దూరం చేసేందుకు సహకరిస్తాయి. కాబట్టి కొద్దిగా క్యారట్ రసంలో చెంచా పెరుగు వేసి.. చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైపెదవిపై మందపాటి లేయర్‌లా పూసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. రోజూ ఈ చిట్కా ప్రయత్నించడం వల్ల కొన్ని రోజులలోనే ఆశించిన ఫలితాల్ని పొందచ్చు.
కీరాదోస రసంతోనూ పైపెదవి పైభాగంలో నల్లగా మారిన చర్మాన్ని కాంతివంతంగా మార్చవచ్చు. ఇందుకోసం కీరా రసంలో ముంచిన కాటన్ బాల్‌తో పైపెదవిపై రసాన్ని అప్త్లె చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరి.
ఆలూ రసంతోనూ పైపెదవి పైభాగంలో ఏర్పడిన నలుపును క్రమంగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం కొద్దికొద్దిగా ఆలూ రసాన్ని ఐదు నిమిషాల వ్యవధిలో కనీసం గంటపాటు అప్త్లె చేసుకుంటూ ఉండాలి. అనంతరం చల్లటి నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
చర్మానికి సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేసే నిమ్మరసం కూడా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం రోజూ రాత్రి ఓ ఇరవై నిమిషాల పాటు ఈ రసాన్ని పైపెదవి పైభాగంలో అప్త్లె చేసుకోవాలి. తర్వాత నీటిలో ముంచి, పిండిన కాటన్ బాల్‌తో ఆ ప్రదేశంలో కాసేపు మసాజ్ చేసుకుంటే.. కొద్ది రోజుల్లోనే చక్కటి ఫలితం లభిస్తుంది.