Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుతున్న జీవన శైలికి అనుగుణంగా చేసే పనుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రజలు శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా వల్ల ఎక్కువ మంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఫలితంగా చాలా మంది బద్దకస్తులుగా మారి అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. ఇలా పని చేసే వారు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం...
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతీ ఒక్కరూ దానికి తగ్గట్టుగా మారుతున్నారు. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ అంటే ఎంటో తెలియని వారికి కూడా దీనిని పరిచయం చేసింది. అవకాశం ఉన్న ప్రతీ సంస్థలో ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్‌ను ఇస్తున్నారు. ఎక్కువగా ఐటీ కంపెనీల వారు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.
రోజుకు ఏకధాటిగా 12 గంటలు కూర్చుని పనిచేసే వారు ఇటీవల బాగా పెరిగిపోయారు. అయితే కదలకుండా అదే పనిగా కూర్చుంటే మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకున్నట్టు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఒకే చోట కదలకుండా గంటల కొద్దీ కూర్చుని పనిచేయడం అనేది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది
కాదని నిపుణులు తెలిపారు. ఇది ఎన్నో అనారోగ్యాలను తెచ్చిపెడుతుందని అంటున్నారు.
రెండు గంటల పాటు అదేపనిగా కూర్చొని ఉంటే మనం 20 నిమిషాల సేపు వ్యాయామం చేయడం వల్ల పొందిన ఆరోగ్యాన్ని నష్టపోతామని చెబుతున్నారు.
కనీసం రెండు గంటలకు ఒకసారైనా లేవకుండా పనిచేసే వారిలో గుండెజబ్బులు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అందుకే అప్పుడప్పుడు కూర్చున్న చోట నుంచి లేచి నడవాలని వారు సూచించారు. ప