Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు... సంపూర్ణం ఆరోగ్యానికి నడక కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌గా ఉండాలంటే రోజుకు కనీసం 10 వేల అడుగులు నడవాలని ఫిట్నెస్ ట్రాకింగ్ డివైజ్‌లు సూచిస్తున్నాయి. రోజుకు కనీసం మహిళలు 4,400 అడుగులు వేసినా కూడా.. అకాల మరణ ప్రమాదాన్ని 40 శాతం వరకు తగ్గించుకోవచ్చని ఓ అధ్యయనం చెబుతోంది. రోజుకు 7500 అడుగులు వేస్తే ఆరోగ్య ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. గతేడాది దాదాపు 5వేల మంది మధ్య వయస్కులైన స్త్రీ, పురుషులపై జరిపిన అధ్యయనంలో దీర్ఘాయువు కోసం రోజుకు 10 వేల అడుగులు నడవాల్సి అవసరం లేదని తేలింది. రోజుకు 8 వేల అడుగులు వేసినా.. లేదా ఇందులో సగం అంటే 4 వేల అడుగులు వేసినా గుండె జబ్బులు, అకాల మరణాన్ని నిరోధించవచ్చని తెలిపింది.
పదివేల అడుగులే లక్ష్యమా: రోజూ 10 వేల అడుగులు నడవడం వల్ల ఎలాంటి హాని లేకపోయినప్పటికీ దీని వల్ల పెద్ద ప్రయోజనం లేదని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. బెల్జియంలో 2005లో నిర్వహించిన ఓ అధ్యయనంలో స్థానికులకు పెడోమీటర్లు ఇచ్చి రోజుకు కనీసం 10 వేల అడుగుల నడవాలని పరిశోధకులు సూచించారు. ఈ పరిశోధనలో సుమారు 600 మంది పురుషులు, స్త్రీలు పాల్గొన్నారు. వీరిలో కేవలం 8 శాతం మంది మాత్రమే 10 వేల అడుగుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. నాలుగేండ్లపాటు కొనసాగిన ఈ అధ్యయనంలో 10 వేల అడుగుల లక్ష్యాన్ని ఎక్కువ రోజులు ఎవరూ చేరుకోలేదు. రోజుకు 10 వేల అడుగులు నడిచే బదులు ఫిజికల్ యాక్టివిటీకి సమయాన్ని కేటాయిస్తే మంచిదని డాక్టర్ ఇమిన్ లీ స్పష్టం చేశారు. రోజుకు కొన్ని వేల అడుగులు నడిస్తే సరిపోతుందని తెలిపారు.
రెండింటితో ప్రయోజనం: వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని, కచ్చితంగా ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలని నిపుణులు సూచించారు. రోజులో 7 నుంచి 8 వేల అడుగుల నడిస్తే సరిపోతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. నడకకు ఫిజికల్ యాక్టివిటీని జోడిస్తే మొత్తం 16 వేల అడుగులతో సమానమని తెలిపారు. రోజువారీ కార్యకలాపాలైన షాపింగ్, ఇంటి పనుల విషయంలో ప్రజలు రోజుకు కనీసం 5 వేల అడుగులు నడుస్తారని.. దీంతో పాటు 2 నుంచి 3 వేల అడుగులు నడిస్తే 7 నుంచి 8 వేల అడుగులు నడిచినట్టవుతుందని విశ్లేషించారు. ప