Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నలభై ఏండ్లు దాటిన వాళ్ళు బరువు తగ్గడం చాలా కష్టం. అయితే కొన్ని పద్ధతులు అనుసరించడం వల్ల కచ్చితంగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. మన జీవన విధానం, చేసే పనులు వలన బరువు తగ్గే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం...
సలాడ్స్ తినండి: మీరు తినేటప్పుడు సగం ప్లేట్ నిండా సలాడ్, కూరగాయల్ని వేసుకుని తినండి. అదే విధంగా మాంసం, గింజలు కూడా చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు డైట్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. పండ్లు కూరగాయల్లో విటమిన్స్, మినరల్స్ సమద్ధిగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణం అభివృద్ధి అవుతుంది. దీని కారణంగా బరువు తగ్గొచ్చు. అలానే అతిగా ఆహారం తీసుకోవద్దు.
భోజనం మానుకోవద్దు: మంచి ఆహారం తీసుకోవడంతో పాటు మధ్యలో ఏ మీల్స్ కూడా స్కిప్ చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. రోజు మీరు గ్యాప్ ఇచ్చి భోజనం తినడం వల్ల క్యాలరీలు త్వరగా కరిగిపోతాయి అలానే స్నాక్స్ లాంటివి తినడానికి ఉండే టెంప్టేషన్ కూడా పోతుంది. మీల్స్‌ని స్కిప్ చేయడం వల్ల పోషక పదార్థాలని మిస్ అయిపోతూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యంగా మీరు ఉండలేరు. ప్రతి రోజూ అల్పాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు.
మంచిది నీళ్లు తాగడం: మనకి మంచి ఆహారం ఎలా అవసరమో నీళ్లు కూడా అంతే అవసరం. తప్పకుండా ప్రతి రోజూ ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండండి. బరువు తగ్గడానికి నీళ్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. హైడ్రేట్‌గా ఉండటం చాలా మంచిది. నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు మలినాలు తొలగిపోతాయి. సమయానుసారం నీళ్లు తాగడం వల్ల ఆకలి కూడా ఉండదు. ప్రతి రోజు కనీసం రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తాగడం మంచిది. అన్నం తినే ముందు నీళ్లు తాగడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది దానితో మీరు తక్కువ ఆకలి కలిగేలా చేస్తుంది.యాక్టివ్‌గా ఉండండి.
వ్యాయామం చేయండి: రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం కూడా చాలా మంచిది. ఎక్స్ట్రా కొవ్వును తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మీరు బరువు కూడా తగ్గవచ్చు. హార్ట్ రేట్‌ని కూడా ఇది పెంచుతుంది. అదే విధంగా కొవ్వుని కరిగిస్తుంది. కావాలంటే మీరు జుంబా డాన్స్ లాంటివి ప్రయత్నం చేయవచ్చు.రోజూ కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిది. ఒకవేళ కనుక ఏమైనా గాయాలు ఇబ్బందులు ఉంటే అప్పుడు యోగా లేదా వాకింగ్ లాంటివి చేయండి. ఇలా వీటిని అనుసరించినా సరే మీరు బరువు తగ్గొచ్చు.
ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవద్దు: చిప్స్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. అలానే ఎక్కువ కేలరీలు కొవ్వు పదార్థాలు ఉండే ఆహార పదార్థాలను దూరం పెట్టడం మంచిది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ వంటి తక్కువ న్యూట్రియంట్స్ ఉండే ఆహారాన్ని ప్రిఫర్ చేయండి. ఇలా ప్రాసెస్డ్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలగదు. అలానే సోడా డ్రింక్స్ లాంటివి కూడా తీసుకోవద్దు. షుగర్ ఎక్కువగా ఉండే వాటిని కూడా తీసుకోకుండా ఉండటం మంచిది. వీటితో పాటుగా మీకు మంచి నిద్ర కూడా ఉండాలి. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.