Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడూ నెగిటివ్‌గా ఆలోచించే వాళ్ళతో ఉండడం చాలా కష్టం. అందులోనూ పెండ్లయిన తర్వాత నెగిటివ్‌గా ఆలోచించే వాళ్ల పక్కన ఉంటే కాస్త కోపంగా ఉంటుంది. అదే విధంగా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితభాగస్వామి నెగెటివ్‌గా ఉంటే ఎవ్వరికైనా చాలా చిరాకు వస్తుంది. ఇలాంటి ఆలోచనలతో ఉన్న మీ భాగస్వామితో మీరు ఇబ్బంది పడుతుంటే ఈ విధంగా అనుసరించడం. ఇవి మీకు కాస్త ఉపయోగంగా ఉంటాయి.
వ్యక్తిగతంగా చూడొద్దు
మీరు చేయాల్సిన మొదటి పని ఏమిటంటే ఎప్పుడూ కూడా వాళ్ళ నెగెటివ్ ఆలోచనలని మీరు పర్సనల్‌గా తీసుకోకూడదు. అవి వాళ్ళ లోపల భావాలు, ఇబ్బందులు అని మీరు గమనించాలి. అయితే మీ తప్పు ఏమీ లేదు. మీ గురించి వాళ్ళు ఏమీ అనుకోవడం లేదు. అది కేవలం వాళ్ళ ప్రవర్తన అని మీరు తెలుసుకోవాలి. అదే విధంగా ఈ నెగటివ్ ఆలోచనలు మీ మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా చూసుకోండి.
వాళ్ళ దృష్టి మరల్చండి
మీరు కనుక పాజిటివ్ పర్సన్ అయ్యి ఉంటే.. తప్పక మీరు మీ పాజిటివిటీతో ఆ వ్యక్తిని, ఆ ఇంటినీ మార్చడానికి వీలవుతుంది. ఒకవేళ కనుక మీ భాగస్వామి ఏదైనా సందర్భంలో నెగిటివ్‌గా ఆలోచిస్తే అప్పుడు మీరు వాళ్ళని కాస్త పాజిటివ్‌గా షిఫ్ట్ చేయండి. దీనితో మీరు ఆనందంగా ఉండొచ్చు. అదే విధంగా మీ పార్టనర్ కూడా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.
తప్పు ఏదో తెలుసుకోండి
మీరు ముందు వాళ్ళ నెగిటివిటీని ప్రశ్నించడానికి ముందు మీలో ఏమైనా తప్పు ఉందేమో పరిశీలించుకోండి. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ముందు మీరు గ్రహించాలి. అప్పుడు మీ ఆలోచనలు, వారి ఆలోచనలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
వాళ్లతో మీరు మాట్లాడండి
కొంతమంది ఇలాంటి ఆలోచనలు ఉన్నవారితో మాట్లాడడం మానేస్తారు. కానీ అలా చేయకూడదు. దాని వల్ల వారు మరింత నెగిటివ్ ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. అందుకే మీరు వాళ్ళతో మాట్లాడటం వల్ల వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. దీనితో మీరు వాళ్ళ ఆలోచనలని మార్చొచ్చు.
జాగ్రత్తగా వినండి
మొదట ఏదైన సమస్య మీరు పరిష్కరించాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినాలి. వాళ్లు చెప్పేది వింటే మీరు ఏం చేయాలి అనే దానిపై మీకు ఓ స్పష్టత వస్తుంది. వాళ్ళు ఒకవేళ కనుక పూర్తిగా చెప్పలేక పోయినట్టయితే కచ్చితంగా కొద్ది కొద్దిగా చెప్తూ ఉంటారు. దానిని మీరు గ్రహించండి. ఇలా మీరు వాళ్ళ భయాల గురించి ఆలోచనలు గురించి తెలుసుకోవచ్చు. దాంతో సమస్య పరిష్కరించడం చాలా సులభమవుతుంది.
ఆలోచనల్ని మార్చండి
నెగిటివ్‌గా ఆలోచించే వాళ్ళ ప్రవర్తనలో కనుక మీరు మార్పు గమనించినట్టయితే అప్పుడు వాళ్ళని మీరు ఎందుకు పెండ్లి చేసుకున్నారు వంటి పాజిటివ్ విషయాలు చెప్పండి. వాళ్ల గురించి మీరు పాజిటివ్‌గా చెప్పడం వల్ల వారి ఆలోచనలు మారుతాయి. కాబట్టి వాళ్ళతో ఎప్పుడూ మంచి విషయాలని చెబుతూ వుండండి. మీ అందమైన జ్ఞాపకాలని, ముఖ్యమైన విషయాలని వాళ్ళతో షేర్ చేసుకోండి. దీంతో వాళ్లు ఇప్పుడు ఉండే జీవితాన్ని ఇష్టపడతారు. అలానే నెగిటివిటీకి కూడా దూరంగా వాళ్ళు ఉండగలరు.
వీటికి దూరంగా ఉండండి
వాళ్ళలో నెగిటివ్ ఆలోచనలు రాకుండా మార్చడం ఎంత ముఖ్యమో.. మీరు అటువంటి ప్రభావం మీ మీద పడకుండా కాస్త జాగ్రత్తగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇలా చేయడం వల్ల నెగిటివ్ కామెంట్స్‌కి దూరంగా మీరు ఉండొచ్చు. లేదు అంటే కొన్ని కొన్ని సార్లు ఇవి మీ మీద కూడా ప్రభావం చూపించి.. మీరు కూడా మారిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
పాజిటివ్ వ్యక్తుల మధ్య గడపండి
పాజిటివ్‌గా ఉండే వాళ్ళ మధ్యలో ఉంటే పాజిటివిటీ వస్తుంది. కొన్ని కొన్ని సార్లు నెగటివ్‌గా ఆలోచించే వ్యక్తుల మధ్య ఉంటే తెలియక మనం కూడా నెగటివ్‌గా మారిపోయే అవకాశం ఉంది. కనుక నెగిటివ్‌గా ఆలోచించే వ్యక్తులు పాజిటివ్‌గా ఆలోచించి వ్యక్తుల మధ్య ఉండాలి. అదే విధంగా భాగస్వామితో ఎక్కువ సమయాన్ని కూడా గడుపుతూ ఉంటే మంచిది. ఇలా మీరు మీ భాగస్వామితో ఉంటే దాని నుండి బయట పడడానికి వీలుంది.
నిపుణులు చెబుతున్న చిట్కాలని మీరు అనుసరిస్తే తప్పకుండా నెగిటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండొచ్చు. నెగిటివిటీ ఉండడం వల్ల కొన్ని సార్లు జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. కనుక వీలైనంత వరకు నెగిటివిటీని మీ నుండి దూరం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకని రెగ్యులర్‌గా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే కచ్చితంగా నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండొచ్చు.