Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వయసు పెరిగే కొద్దీ ముఖంలో మార్పులు సహజం. కండ్ల కింద నల్లటి చారలు, వలయాలు, ముడతలు వంటివి కనిపించకుండా చేయాలంటే ఈ చిట్కాలు పాటించండి.
- ముఖం మీద మచ్చలు ఉన్నప్పుడు మేకప్ కోసం లిక్విడ్ ఫౌండేషన్ రాసుకోవాలి. ఆ తర్వాత కూడా అవి కనిపిస్తూ ఉంటే కన్సీలర్తో అక్కడక్కడా చుక్కల్లా పెట్టి సమస్య ఉన్న చోట రాస్తే సరి.
- కండ్లకు మేకప్ వేసుకునే ముందు ఐస్ ముక్కని ఓ శుభ్రమైన వస్త్రంలో ఉంచి కండ్ల కింద రాయాలి. దీంతో అవి తాజాగా కనిపిస్తాయి. కండ్ల కింద వలయాలు కనిపించకుండా కొద్దిగా ఐక్రీమ్ రాసుకోవాలి. ఆపై కన్సీలర్తో అవసరమనుకున్న చోట్ల సరిచేస్తే చాలు.
- ముఖం మీద తెరుచుకున్న గంథ్రులు కనిపించకుండా మేకప్ వేసే ముందు ఐస్ముక్కలతో శుభ్రం చేయాలి. ఆపై లిక్విడ్ ఫౌండేషన్ రాసి దానిపై ట్రాన్స్కులెంట్ పౌడర్ రాస్తే చాలు. ముఖం చక్కగా కనిపిస్తుంది.