Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గొంతులో కిచ్ కిచ్ ఉంటే ఇబ్బందే. మాటిమాటికీ గొంతు సవరించుకోవడం, కఫాన్ని ఉమ్మివేయడం ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందైతే కఫాన్ని మింగేస్తారు కూడా. అది చాలా ప్రమాదకరం. అందుకే ఈ గొంతు గరగరకు మనం చెక్ పెట్టాలి. నిజానికి గొంతులో గరగరగా ఉందంటే దానర్థం మన శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా వస్తున్నాయనీ, వాటిపై మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పోరాడుతోందని. అయితే వ్యాధి నిరోధక శక్తి ఓడిపోతున్నప్పుడు మ్యూకస్ (కఫం లేదా శ్లేష్మం) ఏర్పడుతుంది. అది గొంతుకు అడ్డం పడుతుంది. జలుపు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం, పొగ వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి. అందుకే మనం గొంతులో కిచ్ కిచ్ అంతు చూద్దాం. ఇంటి చిట్కాలు చాలు. అవేంటో చూద్దాం.
- గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. గొంతులో గరగర మాయమవ్వడమే కాదు. గొంతులో హాయిగా అనిపిస్తుంది.
- అల్లాన్ని పేస్ట్ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేయండి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది. కావాలంటే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు.
- అల్లంలో బ్యాక్టీరియాలను చంపే గుణాలున్నాయి. గొంతులో మంటను తగ్గించే లక్షణాలున్నాయి. కాబట్టి అల్లాన్ని మెత్తగా నూరి... టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగితే గొంతులో కిచ్ కిచ్ మొత్తం మాయమవుతుంది.
- పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఆకులు తీసివేసి ఆ నీటిని తాగాలి. అంతే... మ్యూకస్ పెట్టే బెడద సర్దుకోవాల్సిందే.
- కొన్ని చామంతి రేకుల్ని నీటిలో వేసి... మరిగించి తాగాలి. కావాలంటే కాస్త తేనె కలుపుకోవచ్చు. ఈ టీ బ్యాక్టీరియాను తరిమికొడుతుంది.