Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాదంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి. అవి మనల్ని అత్యంత అందంగా, ఆరోగ్యంగా మార్చేస్తాయి. అందుకే బాదం పప్పులను రోజూ తినాలి. కొంతమంది బాగున్నాయి కదా అని రోజూ గుప్పెడు దాకా తినేస్తుంటారు. అలా తినకూడదు. ఏదైనా అతిగా తింటే ఆరోగ్యానికి ప్రమాదమే. ముఖ్యంగా బాదం పప్పులు మరీ ఎక్కువగా తింటే వేడి చేస్తాయి. కాబట్టి రోజూ 4 పప్పులు తినాలి. దాంతో ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి... స్లిమ్‌గా తయారవుతాం. ఇంకా వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, మనలో వచ్చే శారీరక మార్పుల గురించి తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ అవుట్: చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలోంచీ పోవాలంటే మనం బాదం పప్పులు తినాలి. ఒకవేళ శరీరంలో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉంటే... రోజుకు 20 నుంచీ 30 బాదం పప్పులైనా తినాల్సిందే. ఫలితంగా వేడి బాగా పెరిగి కొవ్వు కరుగుతుంది.
ఆరోగ్యకరమైన జుట్టు: జుట్టుకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ బాదంలలో ఉంటాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, ధృడంగా పెంచే మెగ్నీషియం, జింక్, విటమిన్ ఇ బాదంలలో ఉంటాయి. అలాగే జుట్టును ఎక్కువ కాలం నిలిచివుండేలా చేసే విటమిన్ బి బాదంపప్పుల్లో ఉంటుంది.
గుండె పదిలం: బాదంలలో యాంటీఆక్సిడెంట్స్, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వును తరిమికొడతాయి. ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బులు దూరమవుతాయి. బాదంలను తొక్కతో సహా తింటే గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది.
ముసలితనానికి చెక్: జుట్టు తెల్లబడిపోవడం, చర్మంపై ముడతల వంటివి వస్తుంటే తప్పనిసరిగా బాదం పప్పులు తినాల్సిందే. ఎందుకంటే వాటిలోని మాంగనీస్.. కొల్లాజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. ఇక విటమిన్ ఇ చర్మాన్ని కాపాడటమే పనిగా పెట్టుకుంటుంది. అందువల్ల రోజూ బాదం పప్పులు తినేవాళ్లకు త్వరగా ముసలితనం రాదు.
మంచి బ్యాక్టీరియాకి మేలు: మన శరీరంలో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయి. అవి మనకు మేలు చేస్తుంటాయి. అవి లేకపోతే మనం చనిపోతాం. కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే. అందుకోసం బాదం పప్పులు తినాలి. ఎందుకంటే ఆ పప్పులపై ఉండే తొక్కలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అవి మంచి బ్యాక్టీరియాను రెట్టింపు సంఖ్యలో పెరిగేలా చేస్తాయి. పొట్టలో నొప్పి, ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నా, ఆహారం సరిగా జీర్ణం కావట్లేదని అనిపించినా తప్పనిసరిగా బాదం పప్పులు తినాలి. ఇలాంటి వాళ్లు రోజుకు 30-35 బాదం పప్పులు తినాలి. ఆరోగ్యం బాగానే ఉన్నవారు మాత్రం రోజుకు నాలుగు తింటే చాలు.
బరువు తగ్గాలంటే తినాల్సిందే: బాదం పప్పులు విపరీతంగా వేడి చేస్తాయి. ఒక్కసారి అవి బాడీలోకి వెళ్లాయంటే చాలు... చెడు కొవ్వును కరిగిస్తాయి. దీనికి కారణం వాటిలోని విటమిన్లు, ఫైబర్. కాబట్టి తింటే బరువు పెరిగిపోతామేమో అని ఆలోచించేవారు సైతం బాదం పప్పులను మాత్రం తినడం మంచిదే.