Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజు ఓ అరటి పండు తింటే అనేక వ్యాధులు పరార్ అవుతాయని సూచిస్తున్నారు.
- అరటిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను తొలగించడానికి ప్రతిరోజూ అరటిపండు తినండి. శరీరానికి హిమోగ్లోబిన్, ఇన్సులిన్ కోసం విటమిన్-బి6 పుష్కలంగా అవసరం. అరటిలో విటమిన్-బి6 ఎక్కువగా ఉంటుంది.
- రక్తపోటుతో బాధపడేవారికి అరటి మెడిసిన్‌లా పని చేస్తుంది. రోజుకు ఓ అరటి తింటే బీపీ నియంత్రణలోకి వస్తుంది. కాబట్టి అరటిని మీ ఆహారంలో చేర్చుకోండి.
- వ్యాయామం చేసే ముందు ప్రతిరోజూ ఒక అరటిపండు తినండి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
- అరటిలో ఇనుము అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు అరటిని తీసుకోవడం మేలు.
- అరటిపండ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అరటి పండు తింటే మరే ఇతర ఆహారాన్ని తినడానికి ఆసక్తి ఉండదు. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ప