Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కండ్ల చుట్టూ వలయాలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నిద్రలేమి, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. నీరు తక్కువగా తాగే వారిలో, ఆస్తమా ఉన్నవారిలో, విటమిన్ సి లోపం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.
- మోసంబిలో అధికంగా ఉండే నిమ్మకాయ గ్లూకోసైడ్ అయిన ఫ్లెవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్, బాక్టీరియల్, కాన్సర్ నిరోధక లక్షణలను కలిగి ఉంది. కాబట్టి మోసాంబి జ్యూస్ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అనేక కంటి ఇంఫెక్షన్లు, గ్లాకోమా, కంటి శుక్లమ్ వంటి కంటి సమస్యలను నివారిస్తుంది.
- మోసంబి చర్మాన్ని మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉన్నవారు రోజూ మోసంబి రసం తాగితే సమస్యలను త్వరగా వదిలించుకోవచ్చు.
- ఫేస్ వాష్, క్రీమ్ సహా అనేక బ్యూటీ ప్రొడక్ట్స్‌లో మోసాంబి రసాన్ని వాడుతారు. విటమిన్ సి కలిగిన సిట్రస్ పండ్లు ఎక్కువగా ఆరోగ్యానికి మేలు చేకూర్చడంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి.
- ప్రస్తుతం వర్షాకాలం సమయంలో చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో కండ్ల చుట్టు నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ సమస్యతో బాధపడే వారు మోసాంబి రసం అక్కడ అప్లై చేసినట్టయితే ఉపశమనం కలుగుతుంది.
- రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మోసాంబి రసం చర్మంలో బ్లీచింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది.