Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లాలి.
- ప్రతిరోజూ వేడివేడిగా విజిటబుల్ సూప్ తీసుకోవాలి. అనేక పోషకాలతో పాటు కమ్మని రుచిని ఇస్తుంది. అల్లం టీ, హెర్బల్ టీ తాగితే మంచిది. సమతులాహారం తీసుకోవాలి. రోడ్డు పక్కల అమ్మే ఆహారం అసలు తీసుకోవద్దు. సేవ్ పూరీ, పానీ పూరీ వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.
- వర్షంలో తడిచినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే షవర్ స్నానం చేయాలి. అప్పుడు జలుబు రాకుండా నివారించుకోవచ్చు.
- తాగే నీరు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిల్టర్ నీటిని లేదా కాచి వడపోసిన నీటిని తాగాలి. ఎక్కువ నీరు తీసుకుంటే శరీరంలో ఉన్న విషపదార్థాలు, హానికారక సూక్ష్మక్రీములను నివారించవచ్చు.
- షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. కాబట్టి చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
- ఇంట్లో, ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్చి ఉంటే దోమలు వ్యాప్తి చెందుతాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధులు రావడానికి దోమలే కారణం. కాబట్టి నీటి నిల్వలను నివారించండి. దోమల నుంచి రక్షణ పొందడానికి దోమతెరలు వాడాలి.