Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యకిరణాలు చర్మానికి డైరెక్ట్‌గా తాకడం వల్ల.. చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్ శాతం తగ్గినప్పుడు ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ కింది చిట్కాలను పాటిస్తే మచ్చలు పోవడమే కాదు.. చర్మం కొత్త మెరుపును సంతరించు కుంటుంది.
అర స్పూన్ నిమ్మరసానికి కాస్తంత గ్లిజరిన్ జోడించి ఆ మిశ్రమాన్ని నల్లమచ్చలున్న ప్రాంతంలో రాస్తే తొందర్లోనే వాటి బాధ వదిలిపోతుంది.
కొంచెం పసుపు, కరివేపాకును కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై రాయాలి.
ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా కలుపుకోవాలి. దానికి కొంత పసుపు, రోజ్‌వాటర్ కలిపి పేస్ట్‌లాగా చేసి రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొంచెం కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా ఉపయోగం ఉంటుంది.
కుంకుమపువ్వును పొడి చేసి దానికి కొంత తేనె కలిపి ముఖానికి రాసుకుంటే బ్లాక్‌హెడ్స్ తొందరగా మాయమవుతాయి.
మచ్చలను తొలగించడంలో సిట్రస్ జాతికి చెందిన పండ్లరసాలకు మించింది లేదు. కొంచెం నిమ్మరసాన్ని కాటన్‌తో తీసుకుని నల్లటి మచ్చలపై రాసి సుతిమెత్తగా మసాజ్ చేయాలి. దీనిలో ఉన్న విటమిన్-సి మచ్చలపై మంచి ప్రభావం చూపిస్తుంది.
కొంచెం దూదిపై పాలు లేదా మజ్జిగ చుక్కలు వేసి దాన్ని మచ్చలున్న ప్రాంతంపై రాసుకోండి. వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.