Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనందాన్ని పంచేది.. అనుబంధాన్ని పెంచేది.. మల్లెల కన్నా తెల్లనిది.. మంచు కన్నా చల్లనిది స్నేహం ఒక్కటే. స్నేహానికి కులం లేదు..మతం లేదు. స్నేహానికి హోదా లేదు.. బంధుత్వం కంటే గొప్పది.. వజ్రం కన్నా విలువైనది.. స్నేహం ఒక్కటే. నిజమైన స్నేహం కష్ట కాలంలో తెలుస్తుంది అంటారు. ఇది అక్షర సత్యం. స్నేహం అనే భావనలో చెసిన అల్లరి, చిలిపి పనులు, ఇటువంటివి ఆనందించే అనుభవలెన్నో. నిజమైన స్నేహాన్ని గుర్తించండి, కలకాలం ఉండేలా కాపాడుకోండి. ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా కొందరి అనుభవాలను మనమూ పంచుకుందాం...
''దోస్త్ మేర దోస్త్... నేస్తమా ఇద్దరి లోకం ఒక్కటేలేవమ్మా....'' ఇలా మనం స్నేహం మీద ఎన్నో పాటలు వింటూ ఉంటాం. సులభంగా లభించేది మోసం... కష్టంగా లభించేది గౌరవం... హృదయంతో లభించేది ప్రేమ... అదృష్టం కొద్దీ లభించేది స్నేహం.. స్నేహాన్ని వర్ణించటానికి తెలుగు భాషలోని పదాలు సరిపోవేమో.. అంత మధురమైనది స్నేహం. స్నేహ మాధుర్యంలో ఒకరిపై ఒకరు చూపించే శ్రద్ధ, తన పట్ల తాను అశ్రద్ధ వహిస్తే కోప్పడుతూ కురిపించే మమకారకెలేన్నో... స్నేహం అనే బంధంలో పంచుకునే బాధ లెన్నో... నిజమే.. ఎప్పుడు మనసు కలత చెందిన, ఏ మాత్రం ఇతరుల వలన మనసు గాయపడిన స్నేహితులకు చెప్పుకుని ఓదార్పు పొందిన సంఘటనలు మనకు నిత్య జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి.
స్నేహాన్ని మరువకండి
స్నేహం విలువ ఇప్పటి తరం వారికి తెలియటం లేదనే అనాలి. స్వార్ధంతో చేసేది నిజమైన స్నేహం కాదు. స్నేహంలో ఓ నమ్మకం, ధైర్యం, భరోసా, లాలన, ప్రేమ, అభిమానం ఇలా ఎన్నో అనుబంధాల కలయికే స్నేహం. మరిచే స్నేహం ఎప్పుడు చేకయకండి. అలాగే చేసిన స్నేహాన్ని మరువకండి. జీవితంలో నిజమైన స్నేహితుడిని వెతకడానికి ముందు మనం ఓ నిజమైన స్నేహితుడిలాగా జీవించాలి. ఎలాంటి స్థితిలో అయినా నిన్ను అర్ధం చేసుకునేవాడు, నువ్వు ఏ స్థాయిలో వున్నా నీతో ఉండేవాడు, నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారే అసలైన స్నేహితులు.
- పాలపర్తి సంధ్యారాణి