Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్చి, క్యాప్సికమ్: వీటిలో ఉండే బీటా కెరొటిన్, ఎ, సి విటమిన్లు ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా కంటిచూపును మెరుగుపరచి, చర్మానికి కాంతినిస్తాయి.
వెల్లుల్లి: ఇందులోని యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలిసిన్ వైరస్లతో పోరాడుతుంది.
అల్లం: ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున వైరస్ను శక్తివంతంగా ఎదుర్కొంటాయి.
బాదంపప్పు: రోగనిరోధక శక్తిని పెంచడంలో బాదంపప్పుది కీలకపాత్ర. ఇ-విటమిన్ కూడా విస్తారంగా ఉంటుంది. నేరుగా తినడం కంటే నానబెట్టి, పొట్టు తీసి తినడం శ్రేష్టం.
పసుపు: ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. పసుపు వేసి పాలను మరిగించి తాగాలి.
బొప్పాయి: ఇందులో పొటాషియం, విటమిన్-బి, ఫోలిక్ యాసిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.