Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ వర్షాకాలంలో వాతావరణమంతా తేమగా ఉండడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఫలితంగా గోళ్లు బలహీనమైపోయి విరిగిపోవడం, సహజత్వాన్ని కోల్పోవడం.. వంటివి తలెత్తుతాయి. మరి, అలా జరగకుండా ఉండాలంటే గోళ్ల సంరక్షణ విషయంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.
మన శరీరంలోని అతి సున్నితమైన భాగాల్లో గోళ్లు ఒకటి. ఇవి పదే పదే నీటిలో నానడం వల్ల తేమను కోల్పోయి బలహీనమైపోతాయి. ఈ క్రమంలో వాటికి తిరిగి తేమనందించడం చాలా ముఖ్యం. ఇందుకోసం అల్ఫా హైడ్రాక్సీ ఆధారిత హ్యాండ్ లోషన్తో గోళ్లను కాసేపు మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.
ఇంటి పనులు చేసేటపుడు చేతులకు గ్లౌజులు వాడడం మంచిది. ఎందుకంటే గిన్నెలు తోమడానికి మనం ఉపయోగించే సబ్బుల్లో అసిటోన్ అనే రసాయనం ఉంటుంది. ఇది గోళ్లను బలహీనపరుస్తుంది.అలాగే నెయిల్ పాలిష్ రిమూవర్లలో ఉండే అసిటోన్ కూడా గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి ఈ రసాయనం లేని, 'న్యాచురల్' లేదా 'ఆర్గానిక్' అని రాసున్న రిమూవర్లైతే మంచివంటున్నారు నిపుణులు.
గోళ్లను షేప్ చేసుకునే సమయంలో పదే పదే నెయిల్ ఫైల్ని ఉపయోగించడం వల్ల గోళ్లు బలహీనమవుతాయి. అందుకే దీన్ని అరుదుగా ఉపయోగిస్తూనే.. నెమ్మదిగా గోళ్లను షేప్ చేసుకోవడం మంచిది.
స్నానానికి ముందు గోళ్లను పెట్రోలియం జెల్లీతో కాసేపు మర్దన చేసుకొని.. ఆపై సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. వరుసగా రెండు వారాలు ఈ చిట్కా పాటిస్తే గోళ్లు బలంగా మారతాయి.
వర్షాకాలంలో గోళ్లు పెంచుకోవడం కంటే చిన్నగా కత్తిరించుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలోకి మురికి చేరి.. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.. ఒకవేళ పెంచుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుకోవడమూ ముఖ్యమే!
వీటితో పాటు గోళ్ల ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర వహించే బయోటిన్ సప్లిమెంట్స్ని డాక్టర్ సలహా మేరకు వాడచ్చు