Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలసరి వచ్చే వారం ముందు రోజు రాత్రి అరకప్పు నీటిలో అయిదారు ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. ఉదయం వాటిని నీటిలో మెత్తగా చేసి, రెండు కుంకుమ పూరేకలను కలిపి పరగడుపునే తీసుకుంటే మంచిది.
సెనగలు లేదా పెసలను మొలకలు చేసి ఉంచుకోవాలి. అల్పాహారం లేదా మధ్యాహ్నపు భోజనంలో ఆవిరిపై ఉడికించిన మొలకలను కలుపుకొని తీసుకోవాలి. ఇలా వారం ముందు నుంచి చేస్తే, నెలసరి నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
రోజూ పావుగంట వ్యాయామం తప్పనిసరి. కాల్షియం లభించే వెన్న, పెరుగు, పాలు, ఆకుపచ్చని కూరగాయలు, సోయాబీన్స్ వంటివి వీలైనంతగా తీసుకోవాలి. మూడు పూటలా చెంచా నెయ్యి తీసుకుంటే నెలసరి నొప్పికి దూరంగా ఉండొచ్చు. పల్లీలను బెల్లంతో కలిపి తీసుకుంటే ఆ సమయంలో మూడ్స్వింగ్స్ తగ్గుతాయి.