Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రక్త హీనత కారణంగా చాలా బలహీనంగా కనిపిస్తారు. ఎప్పుడూ అలసటగా ఉంటుంది. తరచూ తలనొప్పి వస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారం తీసుకుంటే రక్తం బాగా పెరుగుతుంది. ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
శరీరంలో రక్తం పెరుగుదలకు బీట్ రూట్ దోహదపడుతుంది. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నుంచి మలినాలను తొలగించడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనే ఉండదని చాలా మంది చెబుతుంటారు. యాపిల్‌తో అన్ని లాభాలున్నాయి మరి. మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది యాపిల్.
చూడానికి రక్తంగా ఎర్రగా కనిపించే దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మను రోజూ తింటే శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది.
ఖర్జూరాలు, బాదం, వాల్ట్స్ వంటి ఎండు ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి తీసుకోవడం వలన రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే మీరు తినే ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా పాలకూరను చేర్చాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.