Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. బాదంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
బాదం తినడం వలన అన్ని వయసుల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.
నానబెట్టిన బాదం తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే బాదాన్ని నిర్ధిష్ట సమయంలో తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది.
రాత్రి బాదంపప్పు నానబెట్టండి. దాన్ని ఉదయం అల్పాహారం ముందు తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
నానబెట్టిన బాదంపప్పు తినడం ద్వారా దానిని జీర్ణించుకోవడం సులభం. ఇది ఎంజైమ్‌ల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. తద్వారా మీ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.
నానబెట్టిన బాదంపప్పులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం ఉంటాయి. బాదం రోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె జబ్బు ఉన్నవారికి బాదం చాలా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించుతుంది. డయాబెటిస్ బాధితులు దీని నుంచి ప్రయోజనం పొందుతారు.
నానబెట్టిన బాదంపప్పులలోని విటమిన్ ఈ చర్మం, జుట్టు రెండింటికీ గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది.