Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంటకాలలో సువాసన ద్రవ్యంగా ఉపయోగించబడే యాలకుల్లో ఔషధ గుణాలు నిండుగా వున్నాయి.
మానసిక ఒత్తిడికి గురైన వారు యాలకల ''టీ'' తాగితే ప్రశాంతతను పొందుతారు. టీ పొడి తక్కువగానూ, యాలక్కాయలు ఎక్కువగానూ కలిపి టీ తయారు చేస్తున్నపుడు వెలువడే సువాసనను పీల్చడం ద్వారా వల్ల, ఆ టీ తాగడం వల్ల కలిగే నూతనోత్సాహం వల్ల మానసిక ఒత్తిడి త్వరగా నయమైపోతుందట.
నోటిలో నీరు ఊరడం, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఏర్పడే తలనొప్పి, వాంతులు, ఊపిరితిత్తుల్లో కఫం మొదలైన సమస్యలకి కేవలం యాలుక్కాయలను నోట్లో వేసుకుని నమలడంతోనే నివారణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరసాన్ని పోగొట్టి ఆకలిని పెంపొందించడంలో యాలకులు మెండుగా పనిచేస్తుందని వారు చెప్తున్నారు.