Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనందరం శారీరకంగా అలసిపోతే... విశ్రాంతి తీసుకుంటాం... మానసికంగా అలసిపోతే మాత్రం తీసుకోం. ఎందుకంటే టెన్షన్లతో వచ్చే అలసటను మనం పెద్దగా పట్టించుకోం. కానీ అదే తెలియకుండానే ఎన్నో వ్యాధులు వచ్చేందుకు కారణం అవుతోంది. మరి మెంటల్ టెన్షన్లు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
వ్యాయామం ఒత్తిడిని జయించేందుకు మొదటి అస్త్రంగా చెప్పుకోవచ్చు. వాకింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం, దిగడం, పిల్లలతో ఆటలు, సైక్లింగ్, పెంపుడు జంతువులతో ఆటలు ఇలా శరీరాన్ని కదిలించే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా ఒత్తిడిని జయించేలా చెయ్యగలవు. ఇలా చేసినప్పుడు బాడీలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతుంది. ఇది పాజిటివ్ ఫీలింగ్స్‌ని పెంచుతుంది.
మంచి ఆహారం కూడా టెన్షన్ తగ్గిస్తుంది. బలమైన ఆహారం... మన మెదడును చురుగ్గా మార్చుతుంది. శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
వరుసగా పనులు చేస్తూ ఉన్నా... ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తున్నా టెన్షన్ పెరుగుతుంది. అందువల్ల దష్టిని మరల్చుకోవాలి. పనిలో కాస్త బ్రేక్ తీసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తల్ని మరీ ఎక్కువగా చూడవద్దు. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. పజిల్స్ ఆడాలి, బోర్డ్ గేమ్స్ ఆడాలి. సరదాగా ప్రకతిలో తిరగాలి. ఏదైనా వేరే ప్రాజెక్టును చేపట్టి... సరదాగా దాన్ని పూర్తి చేస్తూ ఉండాలి. ఓ కొత్త పుస్తకం చదవాలి. ఇలా నచ్చినది కాసేపు చేయడం ద్వారా... రెగ్యులర్ పని నుంచి బ్రేక్ తీసుకొని టెన్షన్ తగ్గించుకోవచ్చు.
మనం మనుషులం. ఒంటరిగా బతకలేం. అందువల్ల వీలైనప్పుడల్లా అందరితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి. అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి. సమస్యల్ని చెప్పుకోవడం ద్వారా సాంత్వన లభిస్తుంది.
ఒత్తిడికి అనేక కారణాల్లో ఒకటి నిద్ర లేమి. చాలా మంది రోజుకు 5 గంటలు కూడా పడుకోరు. సైకాలజిస్టుల ప్రకారం రోజుకు కనీసం 6 గంటలు పడుకోవాలి. మంచి నిద్ర వల్ల శరీరంలో అన్ని అవయవాలూ... తిరిగి ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటాయి. బ్రెయిన్ బాగా పనిచేసి పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి.