Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు నియంత్రణలో ఉంటేనే అందం, ఆరోగ్యం. అదుపు తప్పిన బరువు వల్ల... హార్మోన్ల సమస్యలు, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు.. ఎన్నో వస్తాయి. మరి అలాంటి బరువు నియంత్రణలో ఉండాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి.
- చాలామంది మహిళలు తీపి పదార్థాలు లేనిదే భోజనం ముగించరు. వీటిలో ఎక్కువ మొత్తంలో చక్కెరలు, కెలొరీలు ఉంటాయన్న సంగతి మరవొద్దు. కాబట్టి తప్పనిసరిగా ఆహారంతోపాటు తీసుకోవాలనే నిబంధనకు నీళ్లు వదలండి. కొన్ని రోజులపాటు తియ్యటి పదార్థాలకు దూరంగా ఉండండి. వీటిని తగ్గించడం వల్ల క్రమంగా కెలొరీలు తగ్గుతాయి.
- కొంతమంది భోజనం తర్వాత స్నానం చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ, జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. అంతేకాదు... రక్తప్రసరణ వేగం పొట్ట నుంచి కింది భాగాలకు కూడా తగ్గిపోతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ జీర్ణ వ్యవస్థను నెమ్మదింప చేస్తాయి.
- ఆహారం తినే సమయంలో, తిన్న తర్వాత చల్లటి నీళ్లు అస్సలు తాగొద్దు. ఇవి జీర్ణక్రియ సాఫీగా జరగకుండా అడ్డుకుంటాయి. ఆహారం సరిగా జీర్ణం కాకపోతే రకరకాల ఉదర సంబంధ సమస్యలు వస్తాయి.
- కొందరికి భోజనం తిన్న వెంటనే ఓ పండు తినే అలవాటు. ఇలా చేయడం వల్ల పండ్లు అరగవు. దాంతో అవి కడుపులో పులిసిపోతాయి. అంతేకాదు జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. కాబట్టి భోజనానికి గంట ముందు పండ్లు తినాలి. ఇలా చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది.
- కొందరు తిన్న చోటే అలాగే చాలాసేపు కూర్చొండి పోతారు లేదా పడుకుంటారు. ఈ రెండు పద్ధతులూ మంచివి కావు. తిన్న తర్వాత కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు నడవాలి. ఇలా చేస్తే ఆహారం సరిగా అరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాం.