Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. మొక్కజొన్న గింజల నూనెను చర్మానికి రాస్తే దీనిలో ఉండే లినోలె యాసిడ్ చర్మ మంటలను, ర్యాష్‌లను తగ్గిస్తుంది.
మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.
ఎముకల బలానికి అవసరమైన లవణాలు, మినరల్స్ మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా వీటిలో ఉండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గిస్తుంది. మొక్కజొన్నను ప్రతిరోజు తినడం వలన హెయిర్ ఫోలీ సెల్స్‌కు బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి పవర్‌పుల్ యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల హెయిర్ స్మూత్‌గా, మంచి షైనింగ్‌గా ఉంటుంది.