Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరైన జీవనశైలిని అనుసరించకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఇది మహిళల సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వంధ్యత్వం వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా సంతానోత్పత్తిని కాపాడుకోవడం అవసరం. సమతుల్య ఆహారం తీసుకుంటున్నారా, తగినంత నిద్రపోతున్నారా, వ్యాయామం చేస్తున్నారా అని చూడటం ముఖ్యం.
పోషకాలతో కూడిన ఆహారం లేకపోవడం, బరువు పెరగడం, వ్యాయామం లేకపోవడం, శారీరక, మానసిక ఒత్తిడి, పర్యావరణం, వ్యసనాలు, మత్తు పదార్థాలు సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కొన్ని అంశాలు.
ఊబకాయం కూడా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది పురుషులలో స్పెర్మ్ కౌంట్, నాణ్యత తగ్గడానికి సంబంధించినది కావచ్చు. చాలామంది ఊబకాయం ఉన్న మహిళలకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్)తో బాధపడుతున్నారు.
బరువు తగ్గడం వల్ల అండోత్సర్గము, గర్భం వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. పొగాకు ఉత్పత్తులు, ధూమపానం స్పెర్మ్ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ప్రతిరోజూ ధూమపానం చేసే మహిళలు ప్రారంభ రుతువిరతి, వంధ్యత్వాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మహిళల్లో గర్భస్రావం, శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అలాగే 35 సంవత్సరాల వయసు తర్వాత గర్భం, ఎండోమెట్రియోసిస్, అకాల అండాశయ వైఫల్యం స్త్రీ సంతానోత్పత్తిని తగ్గిస్తాయి.