Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోషకాల పరంగా చూస్తే వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్‌లో అధికం. ముఖ్యంగా బ్రౌన్ రైస్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. కానీ వైట్ రైస్‌లో ఈ పోషకాలు ఉండవు.
టైప్ 2 డయాబెటిస్ ఉన్న కొందరికి రోజూ బ్రౌన్ రైస్ ఇచ్చి చూడగా వారిలో వైట్ రైస్ తినేవారితో పోలిస్తే షుగర్ లెవల్స్, హెచ్‌బీఎ1సి లెవల్స్ చాలా వరకు తగ్గినట్టు అధ్యయనంలో తేలింది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్‌ను తినడం మంచిది. రోజుకు 50 గ్రాముల బ్రౌన్‌రైస్ తీసుకుంటే మధుమేహం ముప్పు 16 శాతం తగ్గుతుంది.
ఇక బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, ప్రోటీన్లు, మాంగనీస్, విటమిన్లు బి1, బి3, బి5, బి6. కాపర్, సెలీనియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ పోషణను అందిస్తాయి. బ్రౌన్ రైస్‌లో రైబో ఫ్లేవిన్, ఐరన్, పొటాషియం, ఫోలేట్ ఉంటాయి.
ఊపిరిత్తుల వ్యాధి, అలాగే ఉబ్బసాన్ని సైతం బ్రౌన్‌రైస్ నియంత్రిస్తుంది.
బ్రౌన్ రైస్ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. బ్రౌన్ రైస్‌లోని మెగ్నీషియం, కాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వారానికి రెండు నుంచి మూడు రోజులు బ్రౌన్‌రైస్ తినేవారిలో ఆస్తమా ముప్పు 50 శాతం తగ్గుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.