Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలం ప్రారంభమైనప్పుడు చర్మ సమస్యల నుంచి జుట్టు సమస్యల వరకు ప్రతీది ప్రారంభమవుతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా మొటిమలను నయం చేయవచ్చు.
- చెంచా ముల్లంగి గుజ్జుకు అర చెంచా నిమ్మరసం, నాలుగైదు చుక్కల ఆలివ్ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి పావుగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. నిమ్మలోని విటమిన్ సి చర్మాన్ని శుభ్ర పరుస్తుంది. మొటిమల మచ్చలు లేదా ఎండవల్ల కమిలిన చర్మం పూర్వపు కాంతిని సంతరించుకుంటుంది.
ముల్లంగి రసంలో దూదిని ముంచి మచ్చలపై మృదువుగా రాసినా ప్రయోజనం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖంపై 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రపరిచి మెత్తని వస్త్రంతో అద్దితే చాలు. వారంలో నాలుగైదుసార్లు ఇలా చేస్తే మటు మాయమవుతాయి.
- ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే..
చెంచా ముల్లంగి రసానికి చెంచా ఓట్ మీల్ పౌడర్, ఎగ్ వైట్‌ను కలిపి ముఖానికి లేపనంలా పట్టించాలి. పావుగంట తర్వాత మృదువుగా రుద్దుతూ గోరువెచ్చని నీటితో శుభ్రపరిస్తే చాలు. మృతకణాలు పోతాయి. చర్మకణాల్లో రక్తప్రసరణ జరిగి కాంతివంతంగానూ మారుతుంది.
- శిరోజాల ఆరోగ్యానికి ముల్లంగి రసంలో దూదిని ముంచి మాడుకు మృదువుగా రాసి తలకు టవల్ కట్టి ఓ అరగంట ఆరనివ్వాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే చుండ్రుండదు. జుట్టు ఆరోగ్యంగానూ పెరుగుతుంది.