Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు పెరగాలను కునేవారికి ఇది సరైన సమయం. ఈ సమయంలో ఎక్కువ ఆహారం తినేందుకు వీలవుతుంది. తక్కువ నీరు తాగుతూ ఎక్కువ ఆహారం తినొచ్చు. ఇందుకోసం మీరు మీ రొటీన్ డైట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా బరువు పెరిగితే ఆరోగ్యానికి హాని జరగదు. పైగా... ఈ ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది కూడా.
బాదంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల రోజూ బాదం పప్పులు కనీసం నాలు తినాలి. రాత్రి నీళ్లలో ఆరు గింజలు నానబెట్టి ఉదయం తొక్క తీసి ఆరింటినీ తినవచ్చు. అదే డైరెక్టుగా తింటే మాత్రం రోజుకు నాలుగు తింటే సరిపోతుంది. బాదం వల్ల మన నరాలు అభివృద్ధి చెందుతాయి. రోజూ పప్పుల వంటివి తింటే శారీరక అభివృద్ధి త్వరగా సాధ్యమవుతుంది. అందువల్ల బాదంలను మీ డైట్లో చేర్చండి.
గుడ్లను ఉడకబెట్టి తింటే బరువు పెరుగుతారు. గుడ్లలో ఏ, డి విటమిన్లు,... మెగ్నీషియం, సోడియం, పొటాషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. రోజూ ఓ గుడ్డు తిన్నా చాలు మీరు క్రమంగా బరువు పెరుగుతారు.
- కొబ్బరి పాలను మీ డైట్లో చేర్చండి. ఇవి మీ ఆహారంలో కేలరీలను పెంచుతాయి. దాంతో శరీరం బరువు పెరుగుతుంది. కొబ్బరి పాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. సన్నగా ఉండేవారు వీటిని వాడితే బరువు పెరిగి చక్కగా కనిపిస్తారు.
బరువు పెరగాలనుకునేవారు అరటిపండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది. త్వరగా బరువు పెరిగేందుకు ఇవి సహకరిస్తాయి. రోజూ ఓ గ్లాస్ పాలలో ఓ అరటిపండును వేసి మిల్క్ షేక్ లాగా తీసుకుంటే బరువు పెరుగుతారు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి.
బ్రౌన్ రైస్‌ని ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి ఆరోగ్యాన్ని పెంచుతాయి, బరువునూ పెంచుతాయి. వీటిని మీ డైట్లో చేర్చుకుంటే మీ ఆరోగ్యం మెరుగవుతుంది.