Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖం అందంగా ఉంటే సరిపోదు. మనసు కూడా అందంగా ఉండాలి. అప్పుడే చాలా మంది మనల్ని ఇష్టపడతారు. శారీరకంగా ఆకర్షణీయంగా కనిపించడం మన చేతిలో ఉండదు. కానీ మానసికంగా మనం మనల్ని తయారు చేసుకోవడానికి వీలు అవుతుంది. కానీ చాలా మంది అది మనచేతుల్లో లేదనుకుంటారు. అయితే కొన్ని పద్ధతులను ఉపయోగించి మన భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు. మరి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? ఎటువంటి దారిలో వెళితే మనం అలా ఉండగలం...? వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎమోషనల్ ఎట్రాక్షన్‌కి సంబంధించి సైకాలజిస్టులు కొన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్లు చేసిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. సాధారణంగా మనకి స్టేటస్, ఆరోగ్యం, లాజికల్‌గా ఆలోచించడం లాంటి ఎట్రాక్షన్స్ మాత్రమే తెలుసు. కానీ మనకి తెలియని మరొక ఆకర్షణ ఒకటి ఉంది. అదేమిటంటే ఎమోషనల్ ఎట్రాక్షన్. ఎవరికీ తెలియని విషయం సైకాలజిస్టులు కనిపెట్టారు. తక్కువ మంది అర్థం చేసుకున్నా కూడా ఇది నిజంగా ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంది అంటున్నారు.
'నో' చెప్పేయండి
చాలా మంది మొహమాటానికి నేను చేయలేను, నేను చేయను ఇలాంటివి చెప్పకుండా... సరే అని ఒప్పుకుంటారు. కానీ నిజానికి మనసులోని మాటలే చెప్పాలి. కానీ చెప్పలేరు. ఎదుటి వాళ్లు ఏమనుకుంటారో అని లొంగిపోతూ ఉంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఎంతో బలంగా 'నో' అని చెప్పడం చాలా మంచి అలవాటు. ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండే వాళ్ళు వాళ్ల సొంత నిర్ణయాలని పక్కాగా తీసుకుంటారు. అది మంచిగా లేనప్పుడు మంచిగా ఉంది లాంటివి చెప్పారు. ఎదుటి వాళ్ల కోసం తన నిర్ణయాన్ని మార్చుకోలేరు. కాబట్టి ఎప్పుడూ కూడా మీ నిర్ణయాలతో మీరు సూటిగా వెళ్ళండి. అంతే కానీ సరికానిది కూడా సరైనది అని ఒప్పుకోకండి. మీ శరీరం పట్ల మీరు శ్రద్ధ తీసుకున్నా, లేకపోయినా మీరు దీన్ని పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. దీంట్లో కనుక మీరు నిజంగా విజయం సాధించారు అంటే మీరు మంచి రిలేషన్ షిప్లో ఉండగలరు. ఎప్పుడూ మీ రిలేషన్ బ్రేక్ అవ్వడం లాంటివి జరగవు. అయితే ఎమోషనల్‌గా ఎట్రాక్టివ్‌గా ఉండాలంటే ఈ పద్ధతుల్ని అనుసరించండి. దీని వల్ల మీరు ఎమోషనల్లీ ఎట్రాక్టివ్‌గా కనపడగలరు.
ఒకటికి రెండుసార్లు
సాధారణంగా గాసిప్స్ వినడానికి చాలా బాగుంటాయి. ఇతరులతో పంచుకుంటూ సమయాన్ని గడపడం గొప్ప కాలక్షేపంగా ఉంటుంది. అయితే మీరు ఎమోషనల్లీ ఎట్ట్రాక్టివ్‌గా ఉండాలంటే మాత్రం ఎదుటి వారి గురించి నెగెటివ్‌గా చెప్పేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీ సొంత లాభం కోసం అనవసరమైన వాటిని చెప్పకండి. పైగా మీరు ఎవరితోనైనా షేర్ చేసుకునేటప్పుడు వాళ్ల గురించి కూడా మీరు చెబుతారేమో అని వాళ్లలో అనుమానం కలుగుతుంది. కాబట్టి నెగెటివ్‌గా గాసిప్స్ చేసినప్పుడు ఆలోచించడం చాలా అవసరం.
మాట్లాడేటప్పుడు వినండి
సాధారణంగా ఎవరైనా మీగురించి చెబుతూ ఉంటే ఎంత బాగుంటుంది..? నిజంగా మీరు దానిని ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎమోషనల్లీ ఎట్ట్రాక్టివ్‌గా వుండే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వైపు చూడడం, వాళ్ళతో కాస్త సమయాన్ని కేటాయించడం చేస్తారు. మీరు కూడా ఎమోషనల్ ఎట్రాక్టివ్‌గా కనిపించాలంటే దీనిని మీరు అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్లే నా ప్రపంచం అన్నట్టుగా ఉండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎప్పుడూ కూడా దీనిని మర్చిపోకండి. మాట్లాడే మనిషి ఎవరైనా సరే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే పోయేదేముంది కొద్దిగా సమయం వెచ్చించడం. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ల కోసం సమయాన్ని ఇవ్వండి. ఆ తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు
సమయపాలన పాటించండి
సమయపాలన పాటించడం జీవితంలో చాలా ముఖ్యమైనది. సాధారణంగా స్కూల్‌కి వెళ్లే వయసు నుండి కూడా సమయపాలన నేర్పిస్తారు. ప్రతి దాంట్లో కూడా టైంకి ఉండాలి అని చెబుతూ ఉంటారు. కేవలం స్కూల్లో మాత్రమే కాదు ఇంట్లో కూడా తల్లిదండ్రులు సమయపాలన పాటించడం, సమయం వల్ల కలిగే ఉపయోగాలు... ఇలా ప్రతిదీ చెబుతూ ఉంటారు. సమయపాలన పాటించడం నిజంగా మంచి అలవాటు. జీవితంలో ప్రతి దాంట్లో కూడా సమయపాలన పాటించాలి. ఆలస్యంగా వెళ్లడం లేదా ఆలస్యంగా పనులు చేయడం వలన మీ మీద మంచి ఇంప్రెషన్ ఎదుటి వాళ్ళకి కలగదు. పరిశోధనల్లో కూడా ఈ విషయం తేలింది. రీసెర్చ్ చేసిన పరిశోధకులు ఏమంటున్నారంటే..? ఎప్పుడైనా మీరు ఆలస్యంగా వెళ్లినా, ఏమైనా పనులు ఆలస్యంగా చేసిన అది మంచి ఇంప్రెషెన్ ఇవ్వదు. మీ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్ళినా లేదా ఏమైనా ప్లాన్ చేసిన సరిగ్గా సమయానికి వెళ్ళండి. సమయపాలన పాటించడం వలన ఎమోషనల్లీ ఎట్ట్రాక్టివ్‌గా కనిపిస్తారు. కాబట్టి దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు.
అవసరమైన సందర్భాల్లో
మీకు అవసరమైన సందర్భాల్లో ఎవరైనా మీ పక్కన ఉంటే ఎంత బాగుంటుంది..? అలా ఉండడం వల్ల మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు స్పేస్ ఉండాలి అని. కానీ మీరు దానిని పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే మీకు మీ భాగస్వామి ఎంత ముఖ్యమో ప్రతి క్షణం తెలియజేయండి. అలానే మీ ప్రపంచంలో వాళ్ళు ఎంత ముఖ్యమో వాళ్ళకి తెలియజేయండి. మీ జీవితంలో ముఖ్యమైనది వాళ్లేనని చూపించండి. సాధారణంగా ఒకరి అందాన్ని చూసి ఆకర్షణకి గురవుతారు. కానీ శరీరానికి కంటే కూడా ఎమోషనల్‌గా కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్‌గా చూసి ఆకర్షణకి గురి అయినప్పటికీ వాళ్లతో కలిసి జీవించడానికి మానసికంగా కూడా అర్థం చేసుకోవాలి. చెప్పాలంటే ఫిజికల్‌గా ఆకర్షణీయంగా ఉండడం కంటే ఎమోషనల్ ఆకర్షణ చాలా అవసరం. అయితే ఒకవేళ మీరు ఒకరితో మంచి రిలేషన్లో ఉండాలంటే ఎమోషనల్ ఎట్రాక్షన్ చాలా అవసరం.