Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలియ కుండానే చాలామంది బరువు పెరిగిపోతుంటారు. ఇలాంటి వారు తిరిగి ఆ బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయితే... కొన్ని పండ్లను తినడం ద్వారా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లేంటో తెలుసుకుందాం.
బొప్పాయి: యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఈ పండుని తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు తగ్గి సులువుగా బరువు తగ్గుతారు. ఈ పండు ముక్కలపై కాసింత మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల మరింత ప్రమోజనం. ఓ రెండు మూడు నెలలు బొప్పాయిపండు తినండి.. తేడా మీకే తెలుస్తుంది అంటున్నారు డాక్టర్లు.
రేగుపండ్లు: విటమిన్ సి, ఫైబర్ కలిగి ఉన్న ఈ పండ్లు బరువు తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. కాకపోతే ఇవి అన్ని కాలాలలో లభించవు... ఎండాకాలంలో ఎక్కువగా ఉంటాయి.
స్ట్రాబెర్రీస్: విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఈ పండ్లను తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారని తేలింది. అంతేకాదు ఈ పండ్లు కాన్సర్ కారకాలతో పోరాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్స్: రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీని వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు.
బరువు తగ్గించే పండ్లు తెలియ కుండానే చాలామంది బరువు పెరిగిపోతుంటారు. ఇలాంటి వారు తిరిగి ఆ బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయితే... కొన్ని పండ్లను తినడం ద్వారా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లేంటో తెలుసుకుందాం.
బొప్పాయి: యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఈ పండుని తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు తగ్గి సులువుగా బరువు తగ్గుతారు. ఈ పండు ముక్కలపై కాసింత మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల మరింత ప్రమోజనం. ఓ రెండు మూడు నెలలు బొప్పాయిపండు తినండి.. తేడా మీకే తెలుస్తుంది అంటున్నారు డాక్టర్లు.
రేగుపండ్లు: విటమిన్ సి, ఫైబర్ కలిగి ఉన్న ఈ పండ్లు బరువు తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. కాకపోతే ఇవి అన్ని కాలాలలో లభించవు... ఎండాకాలంలో ఎక్కువగా ఉంటాయి.
స్ట్రాబెర్రీస్: విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఈ పండ్లను తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారని తేలింది. అంతేకాదు ఈ పండ్లు కాన్సర్ కారకాలతో పోరాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్స్: రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీని వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు.
ద్రాక్ష: పొటాషియం ఎక్కువగా ఉండే ద్రాక్ష పండ్లు బరువుని సులభంగా తగ్గిస్తాయి. ఇందులోని ప్రత్యేక గుణాలు దాహార్తిని కూడా తీరుస్తాయి. ప పొటాషియం ఎక్కువగా ఉండే ద్రాక్ష పండ్లు బరువుని సులభంగా తగ్గిస్తాయి. ఇందులోని ప్రత్యేక గుణాలు దాహార్తిని కూడా తీరుస్తాయి.