Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఎంప్లాయిస్ అయి పోయారు. కంప్యూటర్ లేకపోతే కాలం ఆగిపోతుంది అన్నట్టుంది పరిస్థితి. ఏ చిన్న జాబ్ అయినా కంప్యూర్పై పని చేయకతప్పడం లేదు. అయిుతే ఈ వర్క్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు... ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...
ఎక్కువసమయం కంప్యూటర్‌పై కూర్చునే వారు నిటారుగా కూర్చోవడం మంచిదంటున్నారు. అలా కాకుండా.. కాస్తా ముందుకి కానీ, వెనక్కి కానీ, 45 డిగ్రీల్లో వంచి కూర్చోవడం వల్ల అదనపు భారం పడుతుంది.
సరిగ్గా కూర్చోకపోవడం వల్ల మెడ, తలభాగం మీద 20 కిలోల అదనపు భారం పడుతుందంట. ఈ కారణంగా మెడ కండరాలు, వెన్నెముకలో నొప్పులు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.
కాబట్టి కంప్యూటర్ వర్క్ చేసేవారు తల, మెడ ఒకే పొజిషన్లో నిటారుగా ఉంచి పనిచేయాలి.
ముఖ్యంగా స్క్రీన్‌పై అక్షరాల సైజ్‌ని పెంచివర్క్ చేయాలి. దీనివల్ల కంటి సమస్యలు తలెత్తవని సూచిస్తున్నారు.