Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. మరి దేశంలోని మహిళలకు ఏమిచ్చింది? గత ఏడాదిన్నరగా మహమ్మారి జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నది. పెరిగిన బాధ్యతలు, ఆందోళనలతో మహిళల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్య భద్రత. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వేలో భారతీయ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో సురక్షితంగా లేరని తేలింది. 29 శాతం మంది భారతీయ మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ సర్వే చెబుతున్నది. నిజమైన స్వాతంత్య్రం కోసం మహిళలు తమ గొంతు విప్పాలని.. పోరాడాలని స్పష్టమవుతున్న నేపథ్యంలో వివిధ రంగాల్లోని మహిళలు అసలే స్వేచ్ఛ అంటే ఏమంటున్నారో చూద్దాం...
2019లో యూగోవ్ ఓవమ్నిబస్ ప్రపంచ వ్యాప్తంగా చేసిన సర్వే ప్రకారం మన దేశంలో ఆర్థికంగా (39 శాతం), రాజకీయంగా (35 శాతం), ఉద్యోగ అవకాశాల్లో (35 శాతం) మహిళల పరిస్థితి ఇదని అభిప్రాయపడ్డారు. 2019లో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుందాం...
స్వేచ్ఛతో బాధ్యత వస్తుంది
స్వేచ్ఛ అంటే వేరొకరి అభిప్రాయాలకు అనుగుణంగా కాకుండా నేనే సొంత నిర్ణయాలు తీసుకోగలగడం. వాటిని అమలు చేయడం. నా దృష్టిలో స్వేచ్ఛ రిస్క్ తీసుకోగలిగే ధైర్యాన్ని ఇస్తుంది. నాపై నాకు నమ్మకాన్ని ఏర్పరిచి, నేను నమ్మేదాన్ని అనుసరించే విధంగా ప్రోత్సహిస్తుంది. నా మనసులో ఏవైనా హద్దులు, అడ్డంకులను ఉంటే తొలగిస్తుంది. స్వేచ్ఛతో పాటు ఆలోచనాత్మకంగా, తెలివిగా వ్యవహరించే అపారమైన బాధ్యత కూడా వస్తుంది. బాధ్యత లేని స్వేచ్ఛ బానిసత్వంతో సమానం.
- శ్రీవిద్య కన్నన్, ఫౌండర్, అవలీ సొల్యూషన్స్.
నాపై నాకు నమ్కం ఉంది
నా రోల్ మోడల్ మిచెల్ ఒబామా. స్వేచ్ఛ, ధైర్యం, నాయకత్వం... ఇవి మన సొంతం కావాలంటే మనలోని లోపాలను స్వీకరించాలి. రియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రపంచంలో నా ముద్ర వేయాలని నేను కోరుకుంటున్నాను. స్వేచ్ఛ అంటే నేను నా జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నానో అలా ఎంచుకునే స్వేచ్ఛ. నేను కోరుకున్నది, నేను ఎలా ఎంచుకోవాలో అది నా హక్కు. సంతోషకరమైన అభ్యుదయమైన జీవితాన్ని గడపడం నాకు ముఖ్యం. నేను ఎలాంటి సమస్యలూ లేకుండా జీవించాలనుకుంటున్నాను. నేను సమాజం కోసం జీవించకూడదని ఎంచుకున్నాను. నాకు నాపై, తీసుకునే నిర్ణయాలపై నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు ఏమి కావాలో, ఏమి చేయకూడదో వాటిపై దృష్టి పెట్టాను.
- సన్యా ఏరెన్, ఎండీ బెర్క్‌షైర్ హాత్వే హోమ్ సర్వీసెస్
మీ కోసం ఎంపికలు
స్వేచ్ఛ అంటే మీకంటూ సొంత నిర్ణయాలు ఉండడం. వాటిని అమలు చేయడం. తమ జీవితంలో మార్పు కోసం ప్రయత్నించండం. మహిళలకు కేవలం వారు కోరుకున్నది చేయడానికే అనుమతి దొరకడం లేదు. ఈ విషయంలో సమాజాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మార్పును తీసుకురావడం మన అందరి బాధ్యతగా భావించాలి. మన మనసులో స్వేచ్ఛతో, మార్పును తీసుకురావడానికి మనకోసం ఒక వైఖరిని తీసుకోవడానికి, బాధల శబ్దాలను అధిగమించడానికి మనం కలిసి పనిచేయాలి. స్త్రీలుగా మనం కోరుకునే సమతుల్యత మన అభిరుచి నుండి, మన కలల నుండి వెలువడుతుంది. అన్నింటికంటే ముఖ్యమైనది మంచి భవిష్యత్తును నిర్మించడానికి ఉత్సాహంగా సహకరించడం. కాలక్రమేణా మన ప్రాధాన్యతలు మారిపోతాయి. మహిళలు ప్రతిదాని ద్వారా శక్తిని పొందాలి. వారి కంటూ ఓ సొంత గుర్తింపును సాధించాలి. తమను తాము సందేహించుకునే మహిళలందరికీ నా సందేశం ఏమిటంటే మీ కోసం ఎంపిక చేసుకునే సమయం వచ్చింది. ఆ సమయాన్ని వినియోగించుకోండి. మీలో స్ఫూర్తి, ప్రేరణను తెలుసుకోండి. మిమ్మల్ని మీరు రేపటి వైపు నడిపించుకోండి.
- నేహా కుల్వాల్, కంట్రీ మేనేజర్
నేను చేయగలను
స్వేచ్ఛ అంటే తనను తాను విముక్తి చేసుకోవడం. కలలు కనే స్వేచ్ఛను కలిగి ఉండడం. దీని అర్థం మనం మన జీవితాలను ఎలా జీవిస్తున్నామో తిరిగి చూడనవసరం లేదు. వేరొకరి ఇష్టాలు, కోరికల గొలుసులు, సంకెళ్ల కింద మనం జీవించామని గ్రహించడం. సమాజం, తల్లిదండ్రులు, భాగస్వామి లేదా మీ సొంత పిల్లల ఆమోదం కోసం వేచి ఉండకుండా నిర్ణయాలు తీసుకోగలగడం. ప్రత్యేకించి ఈ పితృస్వామ్య సమాజంలో మహిళల జీవితాలను తరచుగా నిర్దేశించే సరిహద్దులను చెరిపివేయడానికి స్వేచ్ఛ మాకు సహాయపడుతుంది. జీవితంలో ఏదీ సులభంగా రాదు. కాబట్టి మనం చాలా ఆంక్షలను స్వీకరిస్తాము. కానీ ఒక మహిళగా ఉండడం అంటే మనం కలలుగన్నది సాధించడానికి కొంచెం ఎక్కువ పోరాడటం. దీని మొదటి దశ 'అవును నేను చేయగలను.. నేను చేస్తాను' అనే వైఖరిని మన మనసునిండా కలిగి ఉండాలి. మనం స్వేచ్ఛను పొందుదాం... ఈ సరిహద్దులను విచ్ఛిన్నం చేద్దాం. ''మీ సమ్మతి లేకుండా ఎవరూ మిమ్మల్ని తక్కువ స్థాయిలో భావించలేరు'' అనే ఎలియనోర్ రూజ్వెల్ట్ మాటలను దృష్టిలో పెట్టుకొని మనపై మనం నమ్మకం పెడదాం.
- దుర్గా చించోలి, ఫౌండర్, స్నగ్ల్ డైరీస్
లైంగిక దాడులు లేని రోజే
స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆటంకం, సంయమనం లేకుండా ఎవరైనా కోరుకున్నట్టు వ్యవహరించే, వ్యక్తీకరించే, ఆలోచించే శక్తిని లేదా హక్కును సూచిస్తుం. అయితే ఇది మన భారతదేశంలో మరింత ఎక్కువగా ఉంటుంది. మహిళలపై లైంగిక దాడుల కేసులు, ఆడపిల్లల గర్భస్రావం, వేధింపులు, వరకట్నపు మరణాలు మొదలైన వార్తలను వినని రోజు నాకు స్వేచ్ఛగా ఉంటుంది.
- సాక్షి గార్గ్, క్లారిటీ కమ్యూనికేషన్స్
నాకు కావలసినది చేసే స్వేచ్ఛ
స్వేచ్ఛ నాకు నా సొంత ఎంపికలను చేయగలదు. అదే సమయంలో ఆ నిర్ణయాల ఫలితాలకు కూడా బాధ్యత వహిస్తుంది. నా వ్యక్తిగత జీవితం లేదా వృత్తిపరమైన జీవితం కావచ్చు. నాకు కావలసినది చేసే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ముఖ్యమైనది. నాకు ఎలాంటి అడ్డంకులు చెప్పని కుటుంబాన్ని కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి మహిళ జీవితంలో ఎంపిక చేసుకోవడం చాలా ప్రాథమిక అంశం. కానీ మన దేశంలో స్త్రీకి ఇది చాలా కష్టమైనది.
-తనయ శర్మ, స్పీకింగ్ హెర్బ్స్
ఓ లక్ష్యం ఉన్నప్పుడే
మనం నమ్మితేనే మనం స్వేచ్ఛగా ఉంటాం. రేపు నా స్వేచ్ఛను నిలిపివేసిన కారకాలను నేను నమ్మడం మానేస్తే నాకు కావలసినది చేయడానికి నాకు మార్గం దొరకదు. కాబట్టి నేను కనీసం చేయాల్సిన ముఖ్యమైన పని నన్ను, నా స్వేచ్ఛకు దూరంగా ఉంచిన అంతర్గత కారకాలను వదిలించుకోవడమే. ఈ రోజు నాకు స్వేచ్ఛ లభించడం ఒక విశేషమని నేను నమ్ముతున్నాను. మాట్లాడడం, భావ వ్యక్తీకరణ, సెటిల్మెంట్, అసోసియేషన్, వృత్తి మొదలైన అంశాల పట్ల నాకు జీవితంలో ఓ లక్ష్యం ఉందని, నా స్వేచ్ఛ ఓ ఉత్ప్రేరకం. అలాగే నా స్వేచ్ఛకు నేను జవాబుదారీగా ఉంటాను. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి స్వేచ్ఛ కూడా నాకు బాధ్యత కల్పిస్తుంది. ఈ ప్రపంచంపై నేను ఎలాంటి ప్రభావం చూపాలో నేను ఎంచుకుంటాను. అదే సమయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను సిద్ధం చేసుకుంటాను.
- ఇషితా సింగ్, మైక్రోసాఫ్ట్
ప్రవాహంలో జీవించడం
ప్రవాహంలాంటి జీవితాన్ని అనుభవించినప్పుడు స్వేచ్ఛ గొప్పతనం మనకు తెలుస్తుంది. మీ జీవితంలో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మీకు తెలియనప్పుడు మీరు ఏమి చేయాలో ఇతరులు మీకు చెప్తారు. అప్పుడు మీరు మీ స్వాతంత్య్రాన్ని వదులుకున్నట్టే. స్వేచ్ఛ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ''నా జీవితానికి అర్థం ఏమిటి'' అనే ప్రశ్నకు సమాధానం కనుగొన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. మీరు మీ ఉద్దేశ్యాన్ని తెలుసుకుని ప్రతిరోజూ దాని స్పృహతో జీవిస్తే, మీరు స్వేచ్ఛగా ఉంటారు.
- అంజలి, ప్రచారకర్త
ఎంపికలు ఉండాల్సిందే
ఓ సంభాషణకర్తగా... స్వేచ్ఛ అంటే ఓ స్వరాన్ని కలిగి ఉండటం. ముఖ్యంగా ఆ స్వరాన్ని ఓ ఉద్దేశ్యంతో ఉపయోగించడం. మన స్వరం గొంతులేని వారికి మద్దతు ఇస్తూ అణగారిన వారికి సహాయం చేయగలిగే స్థాయికి చేరాలి. నా స్వేచ్ఛను నలుగురితో పంచుకుంటూ బాధ్యత కలిగిన ఉండడాన్ని హక్కుగా నేను చూస్తాను. ఓ మహిళా నాయకురాలిగా స్వేచ్ఛ అంటే ప్రత్యేకించి మహిళలకు, వ్యక్తిగత, వృత్తిపరమైన రంగాలలో ఎంపిక చేసుకునే హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. కోవిడ్ లింగ అసమానతలను మరింత తీవ్రతరం చేసింది. ఆ అంతరాన్ని తగ్గించడానికి చాలా కృషి చేయాల్సి ఉంది. మనమందరం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోతే ఎవ్వరం స్వేచ్ఛగా బతకలేము.
- దీప్షిఖ ధర్మరాజ్, సీఈఓ, జెనెసిస్ బీసీడబ్ల్యూ