Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యం బాగుం టుందని చాలామంది భావిస్తారు. మరికొందరు రుచి కోసం తింటుంటారు. ఆయితే వర్షాకాలంలో వీటిని తినడం వల్ల మరిన్ని అధిక ప్రయోజనాలు అందుతాయి.
ఖర్జూరాలు తినడం వల్ల శక్తి స్థాయులు పెరుగుతాయి. హిమోగ్లోబిన్ స్థాయులు కూడా పెరుగుతాయి. నిద్రకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వంటి వాటితో పోరాడే శక్తిని ఖర్జూరాలు అందిస్తాయి.
ఖర్జూరం వ్యాయామం చేసే శక్తిని పెంచుతుంది. ఎసిడిటీ, మలబద్ధకాన్ని తొలగిస్తుంది. పీచు పదార్థం, పొటాషియం, ఐరన్ వంటివన్నీ ఎక్కువగా ఉంటాయి.
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా వీటిని తీసుకోవచ్చు. ఇందులోని ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. గుండెపోటు ముప్పును తగ్గిస్తాయి.
ప్రతి రోజూ ఉదయాన్నే ఖర్జూర పండ్లను తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు తక్కువగా ఉంటే.. భోజనం చేసిన తర్వాత కాసేపటికి వీటిని తీసుకోవాలి. పిల్లలైతే బ్రేక్ ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో తీసుకోవచ్చు.