Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐరన్, క్యాల్షియం, సీ,ఏ,ఈ విటమిన్లు, ఫొలేట్, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలతో నిండిన శనగలు మన శరీరంలో ఎముకలు దృఢ పడేలా పనిచేస్తాయి. మన శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేసే ఈ గింజలు, ఆస్టియోపోరాసిస్, అనీమియాతో బాధపడేవారికి మంచి ఆహారం. ఇందులో సమృద్ధిగా ఉన్న ఫైబర్‌తో మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు పోతాయి. శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపటంలో శనగలు అద్భుతంగా పనిచేస్తాయి. గట్‌హెల్త్ మెరుగయ్యేలా ఇవి తోడ్పడతాయి. అందుకే శనగలను మీకు నచ్చిన రూపంలో తీసుకోండి.. ఆరోగ్యంగా జీవించండి.