Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హై ఫీవర్.. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తే ముందు రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోతుంది. అది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, గాయాలు, దెబ్బలు వంటి లక్షణాలతో పాటు, మలంలో బ్లడ్ రావడం, యూరిన్‌లో బ్లడ్ రావడం వల్ల కూడా ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ప్లేట్ లెట్స్ తగ్గాయి అంటే.. ఎవరో ఒకరు తమ ఒంట్లోని ప్లేట్‌లెట్స్‌ను దానం చేయాల్సి ఉంటుంది. లేదంటే.. ఎప్పుడు ప్రాణాలు పోయేది తెలియదు. అసలు ప్లేట్ లెట్స్ పడిపోకుండా ఉండేందుకు.. సంఖ్యను పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకుంటే చాలు. ప్లేట్లెట్స్ కౌంట్ సరిపోయేంత ఉంటుంది. మరి దాని కోసం ఏం చేయాలి? ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
ప్లేట్ లెట్స్ సంఖ్య పెరగాలంటే దానిమ్మను తినాలి. దానిమ్మ పండు గింజలను తింటే రక్తం వృద్ధి చెందుతుంది. అలాగే.. ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. ఒకవేళ గింజలను తినడం ఇష్టం లేని వాళ్లు జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఎలా చేసినా.. ప్లేట్ లెట్స్ కౌంట్ మాత్రం పెరుగుతుంది.
గుమ్మడి కాయలో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడికాయను జ్యూస్‌లా చేసి కూడా తాగొచ్చు. లేదంటే మెత్తగా పేస్ట్‌లా చేసి ఆ పేస్ట్ నుంచి రసాన్ని తీసి ఆ రసంలో కాసింత తేనె వేసుకొని తాగాలి. అలా చేస్తే.. ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది.
బొప్పాయి ఎన్నో సుగుణాలు ఉన్న గొప్ప పండు. దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయిని నిత్యం తింటే ఎన్నో రకాల లాభాలు. అలాగే ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిన వాళ్లు బొప్పాయిని నిత్యం తీసుకుంటే వెంటనే కౌంట్ పెరుగుతుంది. భవిష్యత్తులో ప్లేట్ లెట్ సంఖ్య తగ్గకుండా చూసుకోవాలనుకుంటే నిత్యం బొప్పాయిని తీసుకోండి. బొప్పాయి ఆకులను ఉడకబెట్టి వాటి రసాన్ని తీసి ఆ తర్వాత ఆకులను తింటే ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది.
సరిపడా నిద్రపోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగుపడింది.. ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది. సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ప్లేట్ లెట్ కౌంట్‌ని పెంచుకోవచ్చని తాజా అధ్యయనాలు నిరూపించాయి. అలాగే టమోటాలు, నిమ్మ, ఆరంజ్ వంటివి డైలీ డైట్లో నేర్చుకోవడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ పెంచుకోవచ్చు.ప