Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారికి వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అయితే డబ్బు, కెరీర్... ఇలాంటి వాటిలోనే కాదు.. జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ స్వతంత్రంగా జీవించగలిగితేనే మనం కోరుకునే సంతప్తి లభిస్తుంది.
ఏ విషయంలోన్కెనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మన సొంతస్త్ర. అయితే కొన్ని విషయాల్లో లోపల ఏదో భయం, బెరుకు మనల్ని వెంటాడుతూ అడ్డుపడుతూ ఉంటాయి. మీకు పాటలంటే చాలా ఇష్టం.. మీ గొంతు కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది. కానీ స్టేజి మీద పాడమంటే మాత్రం చాలా భయం. దీని వల్ల మీకున్న అవకాశాలను కోల్పోవడమే కాదు.. మీలోని ప్రతిభను నలుగురికీ చూపే అవకాశాన్నీ చేజార్చుకుంటారు. దీనికి బదులుగా కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతే విజయం మీ వెంటే ఉంటుంది.
మీరు నిజంగా ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలంటే మీ సంపాదన మీకే ఉండాలి. అయితే సంపాదించే డబ్బును విచ్చలవిడిగా కాకుండా అవసరమున్న సందర్భాల్లో ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. అంతేగానీ మా డబ్బు.. మా ఇష్టం.. దేనికైనా ఖర్చు పెట్టుకుంటామంటే భవిష్యత్తు అవసరాలకు డబ్బు మిగలదు. దీనివల్ల ఇతరులపై ఆధారపడే పరిస్థితులు ఎదురుకావచ్చు. ఇలా ఇతరుల మీద ఆధారపడటం వల్ల మనకు స్వాతంత్య్రం లేకుండా పోయే సందర్భాలు కూడా ఎదురవుతాయి. అందుకే ఎవరిమీదా ఆధారపడకుండా మన భవిష్యత్తుకు తగ్గట్టుగా మనమే ప్లాన్ చేసుకొని పొదుపు చేస్తే ఆర్థికంగానూ ఎవరిమీదా ఆధారపడకుండా స్వేచ్చా, స్వాతంత్య్రాలతో జీవించగలుగుతాం.
అందరితో మనసులోని భావాలను స్వేచ్ఛగా వెల్లడించే గుణం అలవాటు చేసుకోవడం మంచిది. ఇతరులతో మాట్లాడటానికి భయపడితే మనలోని భావాలన్నీ లోపలే మిగిలిపోతాయి. అలా భావాలన్నీ గూడుకట్టుకొని మిగిలిపోయినప్పుడు జీవితంలో అసంతప్తి మాత్రమే మిగులుతుంది. మీ జీవితం అలా కాకుండా ఉండాలంటే ఎంతమంది ముంద్కెనా మీ మనసులోని మాట చెప్పడానికి వెనకడుగు వేయొద్దు. ఎదుటివారు మీకంటే వయసులోనో, హౌదాలోనో పెద్దవారని భయపడాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయాలు తప్పు కానంత వరకూ మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇతరులు మీ మీద అభాండాలు వేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కూడా మర్చిపోవద్దు.
ఇంకొకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలంటే శారీరకంగా, మానసికంగా దఢంగా ఉండటం అవసరం. అలా ఉన్నప్పుడే మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతాం. అందుకే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మంచి ఆహారం తినడం, వేళకు పడుకోవడం.. ఇవన్నీ అలవాటు చేసుకోవాలి.
అన్నింటికంటే ముఖ్యమైన సంగతి.. జీవితంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలనుకుంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకు ఏం అవసరమో గుర్తించి, దాన్ని మీకు మీరే అందించుకోండి. మీ శరీరానికి ఆరోగ్యాన్నందించే అలవాట్లు చేసుకోండి. మీ మనసును మీరే ఇబ్బంది పెట్టకుండా నడుచుకోండి. అలాగే ఇతరులను గౌరవించి, వారిని ప్రేమించడమూ ముఖ్యమే.. అయితే దానికంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ప