Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రోజూవారీ దుస్తులు కాకుండా వ్యాయామం కోసం ప్రత్యేకంగా దుస్తులు తీసుకోవాలి. ఇవి లేత రంగుల్లో మీకు నప్పేలా ఎంచుకోవాలి. మరీ బిగుతుగా, మరీ వదులుగా కాకుండా చక్కగా సరిపోయేవి ఎంపిక చేసుకోవాలి. అలాగే వ్యాయామ పరికరాలను కూడా. ముందు చిన్న చిన్న డంబెల్స్, వెయిట్స్, ఎక్సర్సైజ్ బాల్స్, స్కిప్పింగ్ రోప్ లాంటివి ఎంచుకోవాలి.
వ్యాయామాలు చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం సహజమే. కాబట్టి ఓ తువాలును కూడా కొని పెట్టుకోవాలి. ఇది మదువుగా వందశాతం కాటన్దై ఉంటే బాగుంటుంది.
జిమ్లోనైనా... ఇంట్లోనైనా మీ వర్కవుట్లు అయిపోగానే పరికరాలను వాటి స్థానంలో పెట్టండి. ఇలా చేస్తే ఇతరులకూ, మీకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. లేదంటే కాళ్లకు తట్టుకుని పడిపోవడం, దెబ్బలు తాకడం లాంటివి జరగొచ్చు.
వ్యాయామం మొదలుపెట్టి రెండు మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపించాలని తాపత్రయపడొద్దు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు. మీ శరీరం ఒక వ్యాయామ నియమావళికి అలవాటు పడాలి. నిరంతరం కష్టపడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి సరైన పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే తీరైన శరీరాకతి మీ సొంతమవుతుంది.
చిన్న చిన్న వర్కవుట్లతో మొదలుపెట్టి సంతోషంగా వాటిని పెంచుతూ పోండి. ఆరోగ్యాన్ని, ముచ్చటైన ఆకతిని సొంతం చేసుకోండి.