Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో మొక్కలు పెంచుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే మనకి ప్రశాంతతను కూడా ఇస్తాయి. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంటి ఆవరణలో మొక్కల్ని పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటికి నీళ్లు పోయడం, పూలు కోయడం ఇలా ఎన్నో పనులు చేస్తూ హాయిగా గడుపుతున్నారు. అయితే మనం కేవలం ఇంటి బయట మాత్రమే కాదు ఇంటి లోపల కూడా మొక్కలు పెంచుకోవచ్చు. హాల్లో, స్టడీ రూమ్‌లో ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు మొక్కల్ని నాటుతున్నారు. మీరు కూడా ఇంటి లోపల మొక్కల్ని పెట్టుకోవాలి అనుకుంటున్నారా..? మీ ఇంటిని అందంగా మార్చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే నిజంగా మీ ఇల్లు అందంగా మారిపోతుంది. అదే విధంగా గాలిని కూడా ఇవి ప్యూరిఫై చేస్తాయి. ఇంటికి అలంకరణగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తాయి. మరి ఇంటి లోపల ఎటువంటి మొక్కలు పెట్టుకుంటే బాగుంటాయి.. ఈ కాలానికి తగ్గట్టుగా ట్రెండీగా ఎలాంటి మొక్కల్ని ఉంచుకోవాలో తెలుసుకుందాం...
రబ్బర్ ప్లాంట్
ఇంటి లోపల రబ్బర్ ప్లాంట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా లివింగ్ రూమ్, స్టడీ రూమ్‌లో ఇది ఎంతో అలంకరణగా ఉంటుంది. దీని కోసం పెద్దగా మనం శ్రద్ధ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. సూర్య కిరణాలు కూడా డైరెక్ట్‌గా తగలాల్సిన అవసరం లేదు. దీనిని మెయింటైన్ చేయడం, నీళ్లు పోయడం చాలా సులువు. మూడు రోజులకు ఒక సారి నీళ్ళు పోస్తే సరిపోతుంది. దానికి అదే ఎదిగిపోతుంది. అదే విధంగా గాలిని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఇలా ఈజీగా రబ్బర్ ప్లాంట్‌ని కొనుగోలు చేసి మీ ఇంట్లో పెట్టండి. దీంతో మీకు పెద్దగా శ్రమ ఉండదు పైగా అందంగా కూడా ఉంటుంది.
స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్
ఈ మొక్కని నాటితే నిజంగా ఇంటికే అందం వచ్చేస్తుంది. చాలా తక్కువ మంది ఇళ్లల్లో ఇది ఉంటుంది. దీంతో మీ ఇల్లు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. చిన్న చిన్న ఆకులతో తీగలతో చూడడానికి అద్భుతంగా ఉంటుంది. దీనిని మీరు ఒక వేలాడే కుండీలో నాటి హ్యాంగ్ చేయండి. ఈ మొక్కలు పెంచడానికి కూడా పెద్ద శ్రమ ఉండదు. ఈజీగా మీరు దీన్ని కూడా మెంటెయిన్ చేయగలుగుతారు.
పీస్ లిల్లీ
దీనికి అతి తగ్గువ సూర్య కిరణాలు తగిలితే సరి పోతుంది. పైగా దీన్ని కూడా ఈజీగా నాటొచ్చు. ఎప్పుడైతే మట్టి ఆరిపోతుందో అపుడు మాత్రమే నీళ్లు పోస్తే సరిపోతుంది. అంటే నాలుగు రోజులకు ఒక సారి నీళ్ళు పోస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద ఆకులతో ఎంతో అందంగా ఉంటుంది. మీ ఇంట్లో బెడ్ రూమ్‌లో కానీ హాల్లో కానీ లేదా స్టడీ రూమ్‌లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టినా అందం వస్తుంది.
హార్ట్ ప్లాంట్
దీనిని కూడా తక్కువ మంది ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం. పేరుకు తగ్గట్టుగానే ఎంతో అద్భుతంగా ఇది ఉంటుంది. ఈ మొక్క హదయం ఆకారంలో ఉంటుంది దీని కోసం కూడా మీరు పెద్దగా శ్రమించక్కర్లేదు. చాలా ఈజీగా మెంటెయిన్ చేయొచ్చు. టేబుల్ మీద కానీ ఏదైనా కిటికీ పక్కన కానీ పెట్టుకోవచ్చు. నిజంగా దీనిని కనుక పెట్టారంటే మీ ఇంటికి ఇక డెకరేషన్ అవసరం లేదు.
బర్డ్ ఆఫ్ పారడైస్
సన్ లైట్ తగిలే చోట మీరు ఈ మొక్కని పెట్టుకోవచ్చు. అయితే దీని కోసం మీరు కాస్త శ్రద్ధ పెట్టాలి మంచి మట్టి, ఫర్టిలైజర్ ఉండాలి అంతే. ఇంక పెద్దగా మెయింటైన్ చేయక్కర్లేదు. దానంతట అదే వేగంగా ఎదిగిపోతుంది. ఈ మొక్క పొడుగ్గా ఎదుగుతుంది. పెద్ద పెద్ద ఆకులతో అందమైన పూలతో ఆకర్షిస్తుంది. ఇలా ఇంట్లో అందానికి ఈ మొక్కని మనం పెట్టేయచ్చు. దీనితో ఇల్లు మరింత అందంగా ఉంటుంది.
ఎయిర్ ప్లాంట్
ఈ మొక్కలకు కూడా మీరు పెద్దగా శ్రమించక్కర్లేదు. పైగా ఎంతో అందంగా ఉంటాయి. ఈజీగా ఇది మీ ఇంట్లో ఎదిగిపోతుంది. పైగా చూడడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఈ మొక్కలు నాటితే మీ ఇంటికి అందం రెట్టింపు అయి పోతుంది. వారానికి ఒకసారి మీరు నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత మీరు ఈ మొక్కని హ్యాంగ్ చేస్తే సరిపోతుంది ఇది కూడా గాలిని ప్యూరిఫై చేస్తుంది ఇలా అందంగా ఈ మొక్కలు మీరు ఇంట్లో పెంచుకోవచ్చు. దీనితో మీ ఇల్లు అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అదే విధంగా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
ఇప్పటి వరకు ఇంటి మేడ మీద టెర్రర్స్ గార్డెన్ మొక్కలని నాటి అందంగా పెంచుతుంటారు. బాల్కనీ పెరడులో వివిధ రకాల కాయగూరలుని పూల మొక్కల్ని నాటివుంటారు. అయితే ఇంటిలోపల కూడా ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటే ఇల్లు మరింత అందంగా ఉంటుంది. స్వీట్ హార్ట్ ప్లాంట్ మొదలు బర్డ్ ఆఫ్ పారడైస్ వరకు ఎన్నో మొక్కల గురించి మనం తెలుసుకున్నాం. ఈ అందమైన మొక్కలు కనుక మీకు దొరికితే వాటిని ఇంటికి తీసుకు వెళ్లి.. మీ ఇంటిని అందంగా మలుచుకోండి. దీంతో మీ ఇంటి అందం మరింత పెరుగుతుంది. పైగా చక్కటి మొక్కల వలన ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా కూడా మనం ఉండచ్చు.