Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజంతా పనులతో అలసిపోయి రాత్రి పూట అలా కాసేపు టీవీ ముందు సేదదీరదామనుకుంటారు. అలా సోఫాలో కూర్చొనే నిద్రపోతుంటారు. ఓ పక్క టీవీ శబ్దం వస్తుంటే ఇలా కునికిపాట్లు పడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదంటోంది కెనడాకు చెందిన బెటర్ స్లీప్ కౌన్సిల్. ఇలా నిద్రకు అంతరాయం కలగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియల పనితీరు మందగించడం.. వంటి సమస్యలొస్తాయంటోంది. అందుకే నిద్ర సమయంలో టీవీ, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పూర్తిగా పక్కన పెట్టి హాయిగా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు సుఖనిద్రకు ఉపక్రమించడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ అలవాటు శరీరానికి రిలాక్సేషన్ అందించడమే కాదు.. మానసికంగానూ మనల్ని దృఢంగా ఉండేలా చేస్తుంది. ప