Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుడ్డు మంచి పోషకాహారం. ఆరోగ్యంగా ఉండటానికి చాలామంది తమ ఆహారంలో ప్రతిరోజు గుడ్డు ఉండేలా చూసుకుంటారు. రోజూ ఒక గుడ్డు తింటే.. శరీరానికి శక్తి రావడమే కాకుండా.. పోషకాలు అందుతాయి. మామూలుగా అయితే గుడ్డుతో కూర చేసుకోవడం, ఉడకబెట్టుకోవడం, ఆమ్లెట్గా వేసుకోవడం చేస్తుంటాం. అయితే గుడ్డు పగలగొట్టాక దాని పెంకులు మాత్రం పడేస్తాం. అయితే ఆ పెంకుల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయట. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బోరాన్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, ఇనుము, సల్ఫర్, జింక్ మొదలైన ఇతర సూక్ష్మ మూలకాలను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి గుడ్డు పెంకులతో ఎరువులు తయారు చేయొచ్చంట. మరి గుడ్డు పెంకులతో ఎరువు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
నత్రజని, భాస్వరం లాగా మొక్కలు పెరగడానికి కాల్షియం అవసరం. దీని లోపం ఎదుగుదల తగ్గడానికి, ఆకులు వంకరగా, నల్లని మచ్చలకు దారితీస్తుంది. మొక్కలకు కాల్షియం ఇవ్వడానికి గుడ్డు పెంకుల పొడిని ఉపయోగించవచ్చు. ఎగ్ షెల్ పొడిని ఎరువుగా ఉపయోగించడానికి నాటేటప్పుడు పాటింగ్ మిక్స్ చేయాలి.
అలాగే కాల్షియం సప్లిమెంట్ ట్యాబ్లెట్లకు బదులుగా గుడ్డు పెంకుల పొడిని ఉపయోగిస్తారు. అర టీ స్పూన్ ఎగ్ షెల్ పౌడర్లో 400 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. మీ శరీర అవసరాన్ని బట్టి ఎగ్ షెల్ పౌడర్ తీసుకోవచ్చు. కాల్షియం పళ్ళు పెరగడానికి, బోలు ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.