Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చినుకులు పడుతున్నా బయటకు వెళ్లడం తప్పదు... మరోవైపు చికాకు కలిగిస్తుంది. దుస్తులతోపాటు గడియారం, సెల్‌ఫోన్ నుంచి షూస్ వరకు తడిసి ముద్దవుతాయి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఉండే వాతావరణం కాసేపటికే మారిపోయే ఈ సీజన్ కోసం వాటర్‌ప్రూఫ్ వస్తువులు ఎన్నో వచ్చేశాయి... లెడ్ స్మార్ట్ పేపర్ వాచ్, మొబైల్ పౌచ్, నైలాన్ షూ కవర్స్, వెయిస్ట్పౌచ్, వాటర్‌ప్రూఫ్ షూస్ వంటివి ధరిస్తే చాలు. హ్యాండ్‌బ్యాగులో ఇమిడిపోయే ఫోల్డబుల్ షాపింగ్బ్యాగు, గొడుగు క్యాప్య్సూల్ అవసరానికి ఉపయోగపడతాయి. ఇవి దగ్గర ఉంటే వర్షంలో కూడా సరదాగా గడిపేయొచ్చు. అవేంటో మీరూ చూడండి...